HomeతెలంగాణPawan Kalyan: ఆ ఒక్క దెబ్బతో ‘లోకేష్ డిప్యూటీ సీఎం’ అన్న వారి నోరు మూయించిన...

Pawan Kalyan: ఆ ఒక్క దెబ్బతో ‘లోకేష్ డిప్యూటీ సీఎం’ అన్న వారి నోరు మూయించిన పవన్ కళ్యాణ్.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Pawan Kalyan: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న స్లోగన్ బలంగా వినిపించింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అయితే.. డిప్యూటీ సీఎం కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి పదవికి లోకేష్ అర్హుడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అది కూడా సీఎం చంద్రబాబు ఎదుట అలా అనడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఇకముందు ఇలాంటి ప్రకటనలు వద్దు అంటూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చే దాకా పరిస్థితి వచ్చింది. తొలుత మహాసేన రాజేష్ ఈ తేనె తుట్టను కదిపారు. డిప్యూటీ సీఎం పోస్టుకు లోకేష్ అర్హుడు అంటూ వ్యాఖ్యానించారు. అవి క్రమేపీ విస్తరించాయి. రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి, బుద్దా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం వర్మ తదితరులు లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. చివరకు అనంతపురంలో సీఎం చంద్రబాబు ఎదుటే సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు సైతం డిమాండ్ చేయడం విశేషం. అయితే ఉన్నట్టుండి టిడిపి హై కమాండ్ దీనిపై స్పందించి ప్రచారానికి బ్రేక్ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది అన్నది ఇప్పుడు చర్చ.

* బలంగా ఒక ఒప్పందం
రాష్ట్రంలో మూడు పార్టీలు ( three parties )ఉమ్మడిగా ముందుకు వెళుతున్నాయి. కూటమి దశాబ్ద కాలం పాటు కొనసాగాలని భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి కట్టక ముందే ఒక ఒప్పందానికి వచ్చాయి. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం కావాలని, పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని, మిగతా నేతలకు ఇతర పదవులు పంపకాలు చేసుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ కు ఏకైక డిప్యూటీ సీఎం హోదా ఇస్తేనే గౌరవం అని అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకమునుపే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెరపైకి రావడం విశేషం. కేవలం లోకేష్ టీం గా భావించే నేతలే ఈ తరహా వ్యాఖ్యానాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

* టిడిపిలో లోకేష్ సుప్రీం
వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సుప్రీం లోకేష్( Nara Lokesh ). ఎవరు అంగీకరించినా.. అంగీకరించక పోయినా ఇది వాస్తవం. అయితే తెలుగుదేశం పార్టీ పరంగా లోకేష్ ముందంజలో ఉండాలని కోరుకోవడం తప్పులేదు. పైగా నామినేటెడ్ పదవుల పంపకాలు జరుగుతున్న ఇటువంటి సమయంలో.. లోకేష్ ప్రాపకం కోసం ఇలా మాట్లాడిన నేతలు ఉన్నారు. కానీ ఒకేసారి ఒక వ్యూహం ప్రకారం నేతలంతా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కోరడం మాత్రం.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరిగాయి. సాధారణంగా టిడిపి అనుకూల మీడియా స్ట్రాటజీ ఒకలా ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన కూడా అనుకూల మీడియా నుంచి వచ్చింది. సానుకూలత వస్తే ఒకలా.. లేకుంటే మరోలా వెళ్లడం టిడిపి స్ట్రాటజీ కూడా. లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి.

* తిరుపతి నేతతో కౌంటర్
అయితే లోకేష్( Lokesh) ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారంపై వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ప్రశ్న. ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచారు. మంత్రిగా కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆయన విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఉంటాయి. జనసేన తో పాటు పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉంటాయి అన్నది ఒక అనుమానం. వాస్తవానికి డిప్యూటీ సీఎం అనేది గౌరవం మాత్రమే. టిడిపి హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. వైసిపి హయాంలో అయితే ఏకంగా ఐదుగురిని నియమించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాతే ఆ పదవికి ఎంతో కొంత గౌరవం పెరిగింది. చంద్రబాబు తర్వాత అంతటి ఇమేజ్ పొందగలుగుతున్నారు పవన్. అందుకే ఆ గౌరవం కోసం పరితపిస్తున్నారు తెలుగుదేశం నేతలు. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్.. తిరుపతి నేత కిరణ్ రాయల్ తో కౌంటర్ ఇప్పించినట్లు ప్రచారం నడుస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టిడిపి నేతలు ఎలా కోరుకుంటున్నారో.. అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. అయితే కిరణ్ రాయల్ ప్రకటన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ.. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రకటనలను మానుకోవాలని సూచించడం విశేషం. ఈ విషయంలో టిడిపి ఎలా వెనక్కి తగ్గడం వెనుక పవన్ ప్లాన్ సక్సెస్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular