Jailer Movie villain Vinayakan
Vinayakan : జైలర్’ చిత్రం లో విలన్ గా నటించిన వినాయకన్ చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే, ఇతను సినిమాల్లో కంటే నిజ జీవితం లోనే క్రూరంగా ఉన్నాడని అనిపించక తప్పదు. గతం లో ఇతని గోల ని భరించలేక ఇతని ఇంటి చుట్టుపక్కన ఉండే జనాలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, ఆయన్ని అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు. మళ్ళీ బెయిల్ మీద విడుదల చేశారు. కనీసం ఇప్పటి నుండైనా పద్దతి మార్చుకుంటాడా అంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. మద్యం విచ్చలవిడిగా సేవించి ఎదురు ఇంటి వ్యక్తిని దుర్భాషలాడుతూ కనిపించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. నోటికి వచ్చినట్టు తిడుతూ, ఏది పడితే అది మాట్లాడుతూ, క్రిందకి పడిపోతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. ఇతను ప్రవర్తన చూసి సోషల్ మీడియా నెటిజెన్స్ ఛీ కొడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చూడలేదని అంటున్నారు.
ఇతని ప్రవర్తన కారణంగా ఈమధ్య కాలంలో సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం కూడా మానేశారు దర్శక నిర్మాతలు. జైలర్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇతని కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ తరుచు ఇలా మద్యం సేవించి ఇస్తామిచ్చినట్టు ప్రవర్తించడంతో ఎవ్వరూ ఈయన దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. షూటింగ్ సమయంలో కూడా ఈయన ఇలాగే ప్రవర్తించేవాడట. రజినీకాంత్ ఒకసారి పిలిచి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం తో ఆ సినిమా వరకు బుద్ధిగా ప్రవర్తించాడట. ఈ చిత్రం తర్వాత మళ్ళీ రెండు తమిళ సినిమాల్లో చేశాడు. వాళ్లకు ఇతని వల్ల చాలా ఇబ్బందులు కలిగాయి. పోలీస్ స్టేషన్ లో కూడా ఇతనిపై కంప్లైంట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని మీద కేసులు చాలానే ఉన్నాయి. ఇలాగే ప్రవర్తిస్తూ పోతే ఎదో ఒకరోజు పోలీసులు లాకప్ లో వేసి చితకబాదే అవకాశాలు కూడా ఉన్నాయని.
ఇప్పటి వరకు వినాయకన్ 20 సినిమాలకు పైగా నటించాడు. గత ఏడాది విడుదలైన మలయాళం బ్లాక్ బస్టర్ చిత్రం ‘మార్కో’ లో కూడా విలన్ గా నటించాడు. ఈ ‘కరిందనాధన్ ‘ అనే మలయాళం సినిమా మాత్రమే ఉంది. తమిళం లో దాదాపుగా ఈయన్ని బ్యాన్ చేసినట్టే. తెలుగు లో ఇప్పటి వరకు ఈయన కళ్యాణ్ రామ్ ‘అసాధ్యుడు’ అనే చిత్రం లో మాత్రమే నటించాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈయనకి తెలుగు లో అవకాశాలు రాలేదు. ‘జైలర్’ తర్వాత పలువురు ఇతనితో సినిమాలు చేయాలని అనుకున్నారు కానీ, ఇంత లోపే అతనిపై ఈ కేసులు రావడం, అదే విధంగా అతని ప్రవర్తనపై ఆరా తీసిన తర్వాత ఎవ్వరూ అతని వైపు పోలేదు. ప్రస్తుతం మలయాళం సినీ ఇండస్ట్రీ లో మాత్రమే ఇతనికి అవకాశాలు వస్తున్నాయి.
Actor #Vinayakan shouting & abusing his Neighbor pic.twitter.com/w745mVfY2O
— Milagro Movies (@MilagroMovies) January 21, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Jailer villain vinayakan behaved as he pleased scolding neighbors while drunk
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com