https://oktelugu.com/

Ministers Signed Files : సచివాలయం ప్రారంభించిన రోజే ఇన్ని ఫైల్స్ మీద సంతకం చేసారా..తెలంగాణ మంత్రులు నిజంగా గ్రేట్!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించాడు,ఈ పథకం తో పాటుగా పోడు భూముల పంపిణీ ఫైల్ మీద కూడా ఆయన సంతకం చేసాడు. ఇక ఆయన తనయుడు మంత్రి కేటీయార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు  ఫైల్స్ మీద తన తొలి సంతకం చేసాడు.

Written By: , Updated On : May 1, 2023 / 07:37 AM IST
Follow us on

Ministers Signed Files : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం లో అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న తెలంగాణ గురించి ఎంత చెప్పిన ఇప్పుడు తక్కువే అవుతుంది. సరికొత్త సంక్షేమ పథకాలతో ఒకపక్క జనాలకు మేలు చేస్తూనే, మరోపక్క అభివృద్ధి లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలకు దిక్సూచి లాగ చేసాడు కేసీఆర్. ఇక రీసెంట్ గానే సచివాలయం విషయం లో కూడా మరోసారి తెలంగాణ వైపు అందరూ చూసేలా చేసాడు. చాలా రోజుల నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ఈ సచివాలయం, నిన్ననే ఘనంగా ప్రారంభం అయ్యింది. 235 అడుగుల పొడవు, మరియు 635 గదులతో నిర్మించిన ఈ సచివాలయం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సచివాలయం లో సీఎం కేసీఆర్ ఆరవ ఫ్లోర్ లో కూర్చొని తన కార్యకలాపాలను నిర్వహించనున్నారు.ఇది ఇలా ఉండగా సచివాలయం ప్రారంభించిన రోజే సీఎం తో సహా మంత్రులందరూ కలిసి ఎన్నో ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకం చేసారు.

ఇక ఈ సందర్భంగా ఏ మంత్రి ఏ ఫైల్ మీద సంతకం పెట్టాడో ఒకసారి చూద్దాము, ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించాడు,ఈ పథకం తో పాటుగా పోడు భూముల పంపిణీ ఫైల్ మీద కూడా ఆయన సంతకం చేసాడు. ఇక ఆయన తనయుడు మంత్రి కేటీయార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు  ఫైల్స్ మీద తన తొలి సంతకం చేసాడు.ఇక హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ తెలంగాణ వ్యాప్తంగా కొత్త పోలీస్ స్టేషన్లు మంజూరు చేస్తానని గతం లో మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే నిన్న ఆయన ఫైల్ పై సంతకం చేసాడు. ఇక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి జంట నగరాల్లో హిందూ దేవాలయాల్లో దీప దూప నైవేద్యాల ఫైల్ మీద తన తొలి సంతకం చేసాడు.

శ్రమశక్తి అవార్డుల ఫైల్ మీద మంత్రి మల్లారెడ్డి సంతకం చెయ్యగా, అంగనవాడి సన్నబియ్యం పంపిణీ పై మంత్రి గంగుల కమలాకర్ సంతకం చేసాడు. అలాగే రెండవ విడత దళిత బంధు పథకం పై మంత్రి  కొప్పుల ఈశ్వర్ తొలి సంతకం చేసాడు. ఇక ఎప్పటి నుండో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి హరీష్ రావు తొలి సంతకం చెయ్యగా, చెక్ డ్యామ్స్ నిర్మాణం ఫైల్ పై నిరంజన్ రెడ్డి, కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలు పై మంత్రి ఎర్రబెల్లి , అలాగే అంగన్ వాడీ కేంద్రాల్లో ఒకటి మూడు సంవత్సరాల మధ్య ఉన్న చంటి పిల్లలకు ఉచితంగా పాలు పంపిణీ ఫైలు పై మంత్రి సత్యవతి రాథోడ్ ,మరియు ఉచిత చేప పిల్లల పంపిణీ ఫైలు పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  సంతకాలు చేసారు.