Last Rakhi for Brother : అన్నయ్యకు చివరి రాఖీ.. పండుగ రోజు తీవ్ర విషాదం.. ఇంతటి దారుణం ఊహించలేం

అన్నాచెల్లెళ్ల ఆప్యాయతను తెలిపే ఈ పండుగ రోజు ఇలాంటి విషాదంపై చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా యువతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అమ్మాయిలపై వేధింపుల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు చూడాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : August 19, 2024 11:13 am

Last Rakhi for Brother

Follow us on

Last Rakhi for Brother : అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేసేది రాఖీ పండుగ. ఈ రోజు కోసం అన్నా చెల్లెళ్లు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం కాలంలో చదువులు, పనులు కారంగా బంధాలు దూరమవుతున్నాయి. దీంతో ఒకే కడుపున జన్మించిన వారు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి చదువుకున్నవారు ఆ తరువాత ఎక్కడెక్కడో జీవిస్తున్నారు. కనీసం రాఖీ పండుగ రోజైనా అన్నా చెల్లెళ్లు కలిసి ఆప్యాయంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో రాఖీ పండుగ రోజున ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఈసారి రాఖీ పండగ విషాదాన్ని నింపింది. ఓ చెల్లెలు తన అన్నకు చివరి రాఖీ కట్టి.. ఆ తరువాత ప్రాణాలు విడిచింది. రేపటి వరకు నేను ఉంటానో.. లేదో.. తెలియదు.. అందుకే ముందే రాఖీ కడుతున్నా.. అని ఆ చెల్లెలు చేసి వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

2024లో రాఖీ పండుగను ఆగస్టు 19న జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహిళలు, యువతులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు బయలు దేరారు. అయితే రాఖీ పండుగను 19వ తేదీన మధ్యాహ్నం వరకు జరుపుకోవద్దని కొందరు పండితులు చెప్పారు. దీంతో మధ్యాహ్నం తరువాతనే రాఖీ పండుగ నిర్వహించుకోవాలని అనుకుంటున్నారు. కొందరు ఇవేమీ పట్టించుకోకుండా వేడుకల్లో పాల్గొన్నారు. అయితో ఓ యువతి తన సోదరుడికి ఒక రోజు ముందే అంటే ఆగస్టు 18నే రాఖీ కట్టింది. ఇదే నీకు చివరి రాఖీ అని చెప్పి మరీ కట్టి ఆ తరువాత చనిపోయింది.

తెలంగాణాలో రాఖీ పండుగ రోజు జరిగిన ఈ విషాదంపై కొందరు కంటతడి పెట్టుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన ఓ యువతి కోదాడలో డిప్లోమా చేస్తోంది. అయితే అంతకుముందే ఓ వ్యక్తితో ఈమె ప్రేమ వేధింపులు ఎదుర్కొంటోంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె రాఖీ పండుగకు ఒక రోజు ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో మహబూబాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్రాణాపాయం మీద ఉన్న ఆ యువతని తన సోదరునికి ఆగస్టు 18న రాఖీ కట్టింది. ఈ సమయంలో ‘నేను రేపు ఉంటానో లేదో తెలియదు.. అందుకే ముందే రాఖీ కడుతున్నా’ అని చెప్పింది. అన్నుకున్నట్లు ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచింది. రాఖీ పండుగ రోజు తన సోదరీమణి మరణించడంపై సోదరుడితో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఈ విషయం బయటికి రావడంతో బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్నారు.

అన్నాచెల్లెళ్ల ఆప్యాయతను తెలిపే ఈ పండుగ రోజు ఇలాంటి విషాదంపై చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా యువతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అమ్మాయిలపై వేధింపుల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు చూడాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్ కతాలో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన ఆఘాయిత్యంపై నిరసనలు చల్లారకముందే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. మరోవైపు కళాశాలల్లో, బహిరంగా ప్రదేశాల్లో అమ్మాయిల రక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.