https://oktelugu.com/

Aamir Khan: షారుఖ్ ఖాన్ పై ప్రతీకారం.. సౌత్ స్టార్ డైరెక్టర్ తో అమీర్ ఖాన్ సినిమా వెనుక కథ…

సినిమా అనేది ఒక వ్యసనం...అందుకే చాలా మంది సినిమా ఇండస్ట్రీ కి వచ్చి సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ అందరికీ మంచి అవకాశాలు రావు... ఇక మొత్తానికైతే అవకాశాలు వచ్చిన వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు...అలా ఇండస్ట్రీ లో కష్టపడి సక్సెస్ అయిన వాళ్లలో అమీర్ ఖాన్ ఒకరు...

Written By:
  • Gopi
  • , Updated On : August 19, 2024 / 11:52 AM IST

    Aamir Khan

    Follow us on

    Aamir Khan: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అక్కడ స్టార్ హీరోలు చేస్తున్న ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ మీద పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. కాబట్టి సౌత్ నుంచి వచ్చే సినిమాలకే ఎక్కువ ఆదరణ లభించడంతో అక్కడ జనాలు కూడా మన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ తన తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అవ్వడంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మరొక సినిమా అయితే చేయలేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘లోకేష్ కనకరాజు’ డైరెక్షన్ లో అమీర్ ఖాన్ ఒక సినిమా చేయడానికి సిద్ధం అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్ ‘ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ గా భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

    ఇక అందులో భాగంగానే రజినీకాంత్ ను హీరోగా పెట్టి చేస్తున్న కూలి సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆయన అమీర్ ఖాన్ హీరోగా ఒక భారీ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే లోకేష్ మొదట ఈ స్టోరీని షారుఖ్ ఖాన్ కి వినిపించాడట…కానీ ఆయన దానిని రిజెక్ట్ చేయడం తో అమీర్ ఖాన్ వద్దకు ఆ స్టోరీ తీసుకు వచ్చినట్టుగా తెలుస్తుంది…

    గతం లో షారుఖ్ ఖాన్ రిజెక్ట్ చేసిన 3 ఇడియట్స్, ధూమ్ 3 సినిమాలతో అమీర్ ఖాన్ భారీ సక్సెస్ కొట్టాడు…ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని పలువురు భావిస్తున్నారు…అయితే ఈ సినిమాతో లోకేష్ భారీ సక్సెస్ కొట్టి షారుఖ్ ఖాన్ మీద రివెంజ్ కూడా తీర్చుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక ప్రస్తుతం లోకేష్ కొన్ని ప్రాజెక్ట్ లతో బిజి గా ఉన్నాడు. కాబట్టి అమీర్ ఖాన్ లోకేష్ కాంబోలో సినిమా రావాలి అంటే 2026 లేదా 2027 లో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అమీర్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి అమీర్ ఖాన్ తన సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది…