Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నగరంగా మారిపోయింది. రోజురోజుకు మెట్రో విస్తరిస్తోంది. ప్రజల రవాణాకు పెద్దపీట వేస్తోంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా ఇక మీదట సులభంగా వెళ్లేందుకు ప్లాన్ చేసింది. నగరమంతా మెట్రో పరుగులు పెడుతోంది. దీంతో ఎక్కడ నుంచి ఎక్కడకైనా మెట్రోలోనే ప్రయాణించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. జీహెచ్ ఎంసీ పరిధిలో మెట్రో నలు దిశలా తిరుగుతోంది.
ఫలితంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటోంది. గతంలో ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే బస్సులు ఎక్కుతూ వెళ్లాల్సి వచ్చేది. దూర ప్రాంతానికి వెళ్లాలంటే రెండు మూడు బస్సులు మారాల్సి వచ్చేది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. ఎప్పుడైతే మెట్రో వచ్చిందో ప్రజలకు సౌలభ్యం పెరిగింది. ఎంత దూరమైనా ఓ అరగంటలో చేరుకునే వెసులుబాటు కల్పించింది.
మెట్రో మరింత విస్తరించింది. ప్రస్తుతం నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా కొద్ది సమయంలోనే చేరుకోవచ్చు. అలా మెట్రో రవాణా ఏర్పాట్లు చేయబడ్డాయి. దీంతో బస్సులు ఎక్కే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందరు మెట్రోకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగరమంతా చుట్టి రావొచ్చు. భవిష్యత్ లో ఇంకా మంచి సౌకర్యాలు ఏర్పాటు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల మెట్రో రైల్వే స్టేషన్లలో ఉన్న పబ్లిక్ టాయిలెట్లలో మూత్ర, మలవిసర్జనకు చార్జీలు వసూలు చేస్తున్నారు. మూత్రానికి రూ.2, మలవిసర్జనకు రూ. 5 వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇది మాత్రం ప్రయాణికులకు భారం కానుంది. మెట్రోలో వీటికి చార్జీలు వసూలు చేయడమేమిటని సామాన్యుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. మెట్రోలో టికెట్ కొనుక్కుని ప్రయాణం చేసేటప్పుడు వీటికి ప్రత్యేకంగా చార్జులు వసూలు ఎందుకు చేస్తున్నారని ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.