Nymisha Reddy
Nymisha Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూతురు నైమిశారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అనాథ బాలలను మైదానానికి తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించారు.
ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లి..
ఎల్బీనగర్‌లోని ఓ అనాథాశ్రమంలోని 30 మంది పిల్లలను నైమిశారెడ్డి బుధవారం ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు. అక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్‌జెయిట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూపించారు. నైమిశారెడ్డి కూడా వారితో కలిసి మ్యాచ్ చూశారు. ఇక తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసిన అనాథ బాలలు కేరింతలు కొడుతూ సంబరపడిపోయారు. ఈ మ్యాచ్ మరింత ఉత్సాహంగా సాగడం, ఎస్‌ఆర్‌హెచ్ క్రికెటర్లు అభిషేక్, హెడ్ సిక్సర్లతో హోరెత్తించడంతో చిన్నారులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.
నైమిశారెడ్డికి అభినందనలు..
అనాథ పిల్లల కోరిక తీర్చేందుకు సీఎం కూతురు స్వయంగా అనాథ పిల్లలను క్రికెట్ మ్యాచ్‌కు సొంత ఖర్చులలతో తీసుకెళ్లడం.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నైమిశారెడ్డిని తెలుగు ప్రజలు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ బిడ్డ అయిన నైమిశారెడ్డి.. ఆంధ్రా కోడలు కావడంతో అందరూ అభినందనలతో ముంచెతుతున్నారు.
వార్ వన్‌సైడ్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ వార్ వన్‌సైడ్ అన్నట్లుగా సాగింది. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 బంతుల్లో ఛేదించింది ఎస్‌ఆర్‌హెచ్. ఓపెనర్లు హెడ్(89), అభిషేక్(75) పరులు చేయడంతో వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఒకే సీజన్‌లో అత్యధిక సికర్లు బాదిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు 146 సిక్సులు బాదారు. చెన్నై సూపర్‌కింగ్స్ పేరిట ఉన్న 145 సిక్సుల రికార్డును బద్ధలు కొట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 143, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు 142, ముంబై ఇండియన్స్ 140 సిక్సులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.