బైక్ ఉన్నవారికి షాక్.. ఆ తప్పు చేస్తే శాశ్వతంగా లైసెన్స్ రద్దు..?

దేశంలో ప్రతిరోజూ జరిగే ప్రమాదాలలో ఎక్కువ శాతం ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్యమే కారణమని చెప్పవచ్చు. చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో సైబరాబాద్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా బైక్ తో రోడ్డెక్కితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. Also Read: టీఆర్‌‌ఎస్‌లో భయం మొదలైందా..? అందుకే ఆ స్థానానికి పోటీ చేయడం లేదా..? హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ చలానా […]

Written By: Navya, Updated On : February 19, 2021 5:31 pm
Follow us on

దేశంలో ప్రతిరోజూ జరిగే ప్రమాదాలలో ఎక్కువ శాతం ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్యమే కారణమని చెప్పవచ్చు. చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో సైబరాబాద్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా బైక్ తో రోడ్డెక్కితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు.

Also Read: టీఆర్‌‌ఎస్‌లో భయం మొదలైందా..? అందుకే ఆ స్థానానికి పోటీ చేయడం లేదా..?

హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ చలానా కట్టేద్దాం అనుకునే వాళ్లకు షాక్ ఇవ్వడానికి ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. గతంలో హెల్మెట్ లేకుండా పట్టుబడితే పోలీసులు 100 రూపాయలు జరిమానా విధించేవారు. అయితే ఇకపై మాత్రం జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు కానుంది. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయనున్నారు.

Also Read: బీజేపీకి పరీక్షలా ఎమ్మెల్సీ ఎన్నికలు

ట్రాఫిక్ పోలీసులు ఆర్టీవో అధికారులకు శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి ఇప్పటికే సిఫారసు చేశామని పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానుంది. బైక్ నడిపే వ్యక్తితో పాటు బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే బైక్ పై ప్రయాణం చేసే సమయంలో ధరించాల్సి ఉంటుంది. వాహనదారులు ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా చలానాల నుంచి తప్పించుకోవడంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.