Homeతెలంగాణతక్కువ ధరకే నోకియా 4జీ ఫోన్.. గుర్తింపు పొందిన ఆ గేమ్ తో..?

తక్కువ ధరకే నోకియా 4జీ ఫోన్.. గుర్తింపు పొందిన ఆ గేమ్ తో..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నోకియా ఫీచర్ ఫోన్లు కొన్నేళ్ల క్రితం రికార్డు స్థాయిలో అమ్ముడైన సంగతి తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్ల ఎంట్రీ తర్వాత నోకియా హవా తగ్గింది. అయితే నోకియా కొత్త ఫీచర్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ మార్కెట్ ను నిలుపుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 110 4జీ ఫీచర్ ఫోన్‌ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.

13 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్ ప్రత్యేకత కాగా 4జీ కనెక్టివిటీతో పాటు వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, హెచ్‌డీ వాయిస్ కాలింగ్ మరికొన్ని ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. మన దేశంలో ఈ ఫోన్ ధర 2,799 రూపాయలుగా ఉండగా ఈరోజున ఈ ఫోన్ సేల్ కు రానుంది. అమెజాన్, నోకియా వెబ్ సైట్ల ద్వారా ఈ ఫీచర్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఈకామర్స్ వెబ్ సైట్లు స్పెషల్ ఆఫర్లను కూడా అందిస్తుండటం గమనార్హం.

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 1020 ఎంఏహెచ్‌ కాగా 5 గంటల 4జీ టాక్‌టైంను ఈ ఫోన్ అందించనుంది. వీడియో ప్లేయర్, ఎంపీ3 ప్లేయర్, 3 ఇన్ 1 స్పీకర్లు ఈ ఫోన్ లో ఉండటం గమనార్హం. కొత్త తరహా యూజర్ ఇంటర్ ఫేస్ తో నోకియా ఈ ఫోన్ ను లాంఛ్ చేసింది. ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న స్నేక్ గేమ్ కూడా ఈ ఫోన్ లో ఉండటం గమనార్హం. ఫీచర్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఈ ఫోన్ ను కొనుగోలు చేయడం ద్వారా నావిగేషన్ మరింత సులభం కానుంది. ఈ ఫోన్ బరువు 84.5 గ్రాములు కాగా ఈ ఫోన్ మందం 1.45 సెంటీమీటర్లుగా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును ఈ ఫోన్ కలిగి ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version