Beautiful Villages: టూరిజం.. ఆఫీస్, ఇళ్లు.. ఇలా నిత్యం పనులతో సతమతం అయ్యే వారికి ప్రకృతి అందాలు కాస్త రిలాక్స్ ఇస్తాయి. కొందరు దేశంలోని ప్రముఖ ప్రదేశాలు తిరుగుతారు.. డబ్బులు ఖర్చు పెట్టగల స్థోమత ఉన్న మరికొందరు విదేశాలకు వెళతారు.. అందరూ ఇలా తిరగలేరు.. కాబట్టి మన చుట్టూ.. మన దగ్గరలో ఉన్న ప్రాంతాలకు ఆస్వాదిస్తారు. మన తెలంగాణలోనూ అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి.. వన్ డే ట్రిప్ తో అలా వెళ్లి ఇలా రావొచ్చు.. ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వొచ్చు కూడా.. అలాంటి టూరిస్ట్ స్పాట్స్ ను గురించి తెలుసుకుందాం.
పోచంపల్లి..
పోచంపల్లి చీరలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడి కళను గుర్తించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో భాగంగా యునెస్కో గుర్తించింది. గ్రామం చుట్టూ ప్రకృతి మైమరిపిస్తుంది. పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే మొదటి సారి పోచంపల్లి చీరలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు ఇచ్చారు. చేతులతో ప్రత్యేకంగా తయారు చేసే ఇక్కత్ చీరలంటే మహిళలు తెగ ఇష్టపడుతుంటారు. మహిళలు మెచ్చేలా మరమగ్గాలపై నేసే ఈ చీరలు.. రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్.
కొండపోచమ్మ
కొండపోచమ్మ గ్రామం రిజర్వాయర్ సమీపంలో ఉంది. ఇక్కడ సూర్యాస్తమయాన్ని తప్పక చూడాల్సిందే. ప్రకృతి కట్టిపడేస్తుంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ హైదరాబాద్ నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఇది కొత్త పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం అందం, కయాకింగ్, క్యాంపింగ్ వంటి కార్యకలాపాలతో కలిపి.. వారాంతపు విహారానికి అద్భుతమైన ప్రదేశం.
వేములవాడ
వేములవాడలో చారిత్రక దేవాలయం ఉంది. చుట్టూ పచ్చని పొలాల మధ్య అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని శివుని ప్రసిద్ధ దేవాలయాలలో వేములవాడ ఒకటి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు శ్రీ రాజ రాజేశ్వర స్వామిని పూజిస్తారు. వేములవాడ వెయ్యేండ్ల చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది. పౌరాణిక ప్రాశస్త్యాలలో యుగయుగానికి దీని గొప్పతనం కనబడుతోంది. ప్రాచీన శిల్పసంపదతో ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది.
చెర్యాల్
ఈ గ్రామం జానపద కళలు, కళాకారులకు, స్క్రోల్ పెయింటింగ్ కు ప్రసిద్ధి. గ్రామం చుట్టుప్రక్కల పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది.
అనంతగిరి
వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ ప్రియులకు బెస్ట్ ప్లేస్. ఇది తెలంగాణలో అందమైన గ్రామాల్లో ఒకటి. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ ఉంటుంది. వర్షాకాలం సీజన్ లో అక్కడి అందాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ప్రకృతి, పచ్చదనం చూస్తే ప్రతి ఒక్కరూ మైమరిచిపోవాల్సి ఉంటుంది. .ఈ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా అభివర్ణించవచ్చు.
మెదక్
మెదక్ కోట, దీని చుట్టూ ఉండే ప్రకృతికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వన్యప్రాణుల అభయారణ్యలకు ఇది నిలయం. మెదక్ జిల్లా ఒక చరిత్ర గల మెదక్ ఖిల్లా. నిజాం పరిపాలనలో కట్టించినటువంటి ఈ ఖిల్లా ఇప్పటివరకు ఎక్కడా కూడా చెక్కుచెదర కుండా ఉంది. ఈ ఖిల్లా పై కి ఎక్కి చూస్తే నిజాం కాలంలో స్వరం మార్గాలు కనబడుతూ ఉంటాయని అంటారు.
పెంబరి
పెంబర్తి ఇత్తడి వస్తువులకు పేరుగాంచింది. గొప్ప కళాత్మక వారసత్వం ఈ గ్రామంతో ముడిపడి ఉంటుంది. ఈ గ్రామం పేరు చెబితే చాలు అద్భుతమైన హస్త కళాకృతులు, ఎన్నో కళాఖండాలు మన మదిలో మెదులుతాయి. కాకతీయుల కాలంలోనే ఇనుము వినియోగం తెలియక ముందు నుండే రాగి, ఇతర మిశ్రమ లోహాల సహాయంతో పనిముట్లను, రోజూవారీ వినియోగ వస్తువుల తయారీకి పెంబర్తి కేంద్రంగా ఉండేది.
నగునూర్
నగునూర్ గ్రామంలో పురాతన ఆలయాల శిథిలాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతం చరిత్రతో ముడిపడి ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది నగనూర్ గ్రామంలో సుమారు 400 ఆలయాలున్నాయి. ఈ ఊరుని మొదట నన్నూర్‌గా తర్వాతి కాలంలో నగనూర్‌గా పిలుస్తున్నారు. ఎత్తైన కొండలున్న ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించారని ప్రసిద్ధి.
కోటగిరి
కోటగిరి తమిళనాడును పోలి ఉంటుంది. వ్యవసాయ భూముల మధ్య ప్రశాంతంగా ఉండే గ్రామమిది.
లక్నవరం
వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందారాపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. లక్నవరం గ్రామం కొండలు, అడవులతో అద్భుతంగా ఉంటుంది. లక్నవరం సరస్సు పై ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దాని అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: No need to go abroad for tours have you seen these amazing villages in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com