Hydra: విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చాలన్న సంకల్పంతో హైడ్రాను ఏర్పాట చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులను కాపాడడంతోపాటు ఇప్పటికే ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాటయింది. రెండు నెలలుగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది. హైడ్రా స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు పలువురు కోర్టులను ఆశ్రయించారు. కాన్నీ కోర్టులు స్టే ఇవ్వం లేదు. దీంతో హైడ్రా బుల్డోజర్లు మరింత స్పీడ్ పెంచాయి. ధనిక, పేద అనే తేడా లేకుండా, ప్రముఖులు నేతలు అనే వ్యత్యాసం చూడకుండా కూల్చివేతలు కొనసాగిస్తోంది హైడ్రా. ఇటీవలనే ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. సీఎం సోదరుడి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడి హైడ్రా పవర్స్ మరింత పెంచారు.పోలీస్ స్టేషన్ హోదా కూడా కల్పించారు. మరోవైపు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులనూ హైడ్రా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆరుగురు అధికారులపై కేసు నమోదు చేసింది.
అన్నీ మంచి శకునాలే..
హైడ్రాకు అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. కోర్టుల సహకరిస్తున్నాయి. ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వం పవర్ ఇస్తోంది. ఈ తరుణంలో హైడ్రా బుల్డోజర్లు స్పీడ్ పెంచాయి. మరోవైపు ప్రకృతి కూడా హైడ్రాకు తనవంత సహకారం అందిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లో దరదలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ముంపు బాధితులను కాపాడడంతోపాటు వరద ప్రవాహానికి ఆటకంగంగా ఉన్న నిర్మాణాలను గుర్తించడం సులభం అవుతోంది. చెరువులు, కుంటల ఆగ్రమణలను గుర్తించడం కూడా ఈజీగా మారింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధి గుర్తింపునకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండానే ఈజీగా పనులు రుగుతున్నాయి.
పేదల ఇళ్లు కూలుస్తున్నరన్న వాదనలకు చెక్..
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత భిన్నాభిప్రాయాలు వినిపించాయి. పేదల ఇళ్లు కూలుస్తున్నారన్న సెంటిమెంట్ ప్రయోగించేందుకు కొంత మంది రెడీ అయిపోయారు. అయితే ఇప్పుడు దానికికూడా అవకాశం లేకపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కాలం కలసిరావడంతో అసాధారణంగా వస్తున్న వరదలను తట్టుకునే శక్తి ప్రస్తుత నగరాలకు ఉండటం లేదని.. కబ్జా చేస్తున్న చెరువు.. నీరు పోయే మార్గాలను విస్తరించుకోకపోతే మొదటికే మోసం వస్తుందని తాజా వరదలు నిరూపించాయి. విజయవాడ, ఖమ్మం నగరాలకు వచ్చిన వరదలు హైదరాబాద్ కు వచ్చి ఉంటే ఎదుర్కోవడం అసాధ్యం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగేళ్ల కిందట.. రెండు, మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సగం హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. వందల మంది కొట్టుకుపోయారు. అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూండిపోయింది. ఆ ఘటన తర్వాతైనా యుద్ధ ప్రాతిపాదికన చెరువుల కబ్జాల నుంచి బయటపడేయాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆయన చేయాలనుకున్న పని .. చెరువుల నుంచి కబ్జాల నుంచి బయటపడేయడమే. అలాగే మూసి ని హైదరాబాద్‌లో సంస్కరిస్తే.. ఓ పెద్ద ముప్పు తప్పినట్లే. అందుకే మూసి ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూసినా రేవంత్ రెడ్డి .. హైడ్రా ప్రయత్నాలకు వంద శాతం సపోర్టు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.