Nagarjuna Sagar Dam Updates: వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోమైది. అయితే రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నదులు అయిన గోదావరి, కృష్ణ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఇక గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు లేక నది వెలవెలబోతోంది. కృష్ణమ్మకు నెల రోజులుగా వరద వస్తుండడంతో నదిపై తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. జూన్‌లోనే జూరాల గేట్టు ఎత్తగా, జూలై మొదటి వారంలో శ్రీశైలం గేట్టను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎత్తారు. ఇక తాజాగా తెలంగాణలోని అతిపెద్ద జలాశయం అయిన నాగాజ్జున సాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ గేట్లు జూలైలోనే తెరుచుకున్నాయి.
18 ఏళ్ల గ్యాప్ తర్వాత అద్భుతం..
నాగార్జునసాగర్ డ్యామ్‌లో 18 ఏళ్ల తర్వాత క్రస్ట్ గేట్లు తెరవడం ఒక చారిత్రక సంఘటనగా నిలిచింది. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ నిండు కుండలా మారింది. దాదాపు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌లు అధికారులతో కలిసి గేట్లను తెరిచి వరద నీటిని విడుదల చేశారు. దీంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
సాగర్ ప్రస్తుత పరిస్థితి ఇదీ..
నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు(11,472 మిలియన్ క్యూబిక్ మీటర్లు), గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు. ఇటీవలి భారీ వర్షాలు, శ్రీశైలం నుంచి వచ్చిన అధిక ప్రవాహం కారణంగా జలాశయం దాదాపు పూర్తి స్థాయిలో నిండింది. గతంలో 2023లో తక్కువ వర్షపాతం కారణంగా గేట్లు తెరవలేదు. ఈ ఏడాది భారీ వర్షాలు ఈ పరిస్థితిని మార్చాయి. ఈ గేట్ల తెరవడం ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్స్ నీరు దిగువకు విడుదల చేశారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తిస్థాయిలో జరుగుతోంది.
పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి..
నాగార్జునసాగర్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం గేట్ల తెరవడం రైతులకు సాగునీటి లభ్యతను పెంచడమే కాక, 815.6 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతోంది. దీంతో కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటల ఉత్పాదకత పెరుగుతుంది. అయితే, కృష్ణా నది నీటి పంపకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఉన్న వివాదాలు ఇప్పటికీ సమసిపోలేదు.
Nagarjuna Sagar Project crest gates lifted in July for first time in 18years.
Water is being discharged downstream through 14 gates, each opened by 5 feet, totaling 78,060 cusecs. pic.twitter.com/qMBm25GqAV
— Naveena (@TheNaveena) July 29, 2025