HomeతెలంగాణYoutuber Anvesh: అన్వేష్ కేసు లో ఊహించని ట్విస్ట్.. ఇది కదా అసలు దెబ్బ అంటే!

Youtuber Anvesh: అన్వేష్ కేసు లో ఊహించని ట్విస్ట్.. ఇది కదా అసలు దెబ్బ అంటే!

Youtuber Anvesh: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై రోజురోజుకి కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. అతన్ని ఇండియా కి రప్పించే వరకు జనాలు ఊరుకునేలా లేరు. హిందూ దేవుళ్లపై ఇంతటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ మన భారత దేశ జెండాని పీకేసిన తర్వాత కూడా ఇతన్ని 13 లక్షల మంది ఫాలో అవుతున్నారు. వాస్తవానికి 18 లక్షల మంది ఫాలోయర్స్ ఇన్ స్టాగ్రామ్ లో అతనికి ఉండేవారు, ఇప్పుడు అది 13 లక్షలకు తగ్గింది. ఆ 13 లక్షల మంది కూడా ఎందుకు ఫాలో అవుతున్నారు అనేదే విశ్లేషకుల ప్రశ్న.ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే పోలీసులు అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ ఐడీ డీటెయిల్స్ అడుగుతూ, ఇన్ స్టాగ్రామ్ హెడ్ కి ఉత్తరం రాసిన సంగతి తెలిసిందే. వాళ్ళ నుండి సమాధానం వచ్చిందో లేదో తెలియదు కానీ, రీసెంట్ గా అన్వేష్ పై వచ్చిన మరో కేసు హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కరాటీ కళ్యాణి ఇప్పటికే అన్వేష్ ని అరెస్ట్ చేయాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె అన్వేష్ పై మరికొన్ని సెక్షన్లు కలుపుతూ కేసు వేసింది. అన్వేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని, అతనొక దేశద్రోహి అని, మొన్నటి FIR లో ఐటీ సెక్షన్ 69 (A) కూడా చేర్చాలని పోలీస్ వాళ్ళని కోరినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అతని యూట్యూబ్ ఛానల్ ని బ్యాన్ చేయాలనీ, అతని ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ని కూడా ఫ్రీజ్ చేయాలనీ రిక్వెస్ట్ చేశారట. పోలీస్ కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా ఇన్ స్టాగ్రామ్ నుండి ఈ అన్వేష్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ? అనే విషయాన్నీ ట్రాక్ చేయొచ్చని, ఆ తర్వాత అతని పై ఒక్కో స్టెప్పులో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే పోలీసులు బలంగా తల్చుకుంటే ఎలాంటి వాడినని 24 గంటల్లో కోర్టు ముందు ఉంచుతారు. అలాంటిది అన్వేష్ ని ఇన్ని రోజులు అవుతున్నా, ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నా కూడా పోలీసులు పట్టుకోలేదంటే, సజ్జనార్ అన్వేష్ కి క్లోజ్ అవ్వడమే కారణమా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతం లో సజ్జనార్ తో కలిసి అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీలపై పెద్ద పోరాటం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకసారి వీళ్లిద్దరు లైవ్ చాట్ లో కూడా మాట్లాడుకుంటారు. అలా వీళ్ళ మధ్య ఒకప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. అదే ఇప్పుడు అన్వేష్ ని అరెస్ట్ చేయడానికి అడ్డు పడుతుందా అని జనాలు మాట్లాడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular