https://oktelugu.com/

MLC Kavitha: బిడ్డకు విడుదల.. తండ్రి భావోద్వేగం.. కవిత గొంతు వినగానే కన్నీటిపర్యంతమైన కేసీఆర్..

తెలంగాణ ఉద్యమ సారథి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారాల కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయి ఐదున్నర నెలలు ఢిల్లీలోని తిహార్‌ జైల్లో ఉంది. సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో మంగలవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో విడుదలైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 28, 2024 / 11:25 AM IST

    MLC Kavitha(2)

    Follow us on

    MLC Kavitha: తెలంగాణ ఉద్యమ సారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఐదు నెలలకుపైగా తీహార్‌ జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిపి బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆమె మంగళవారం(ఆగస్టు 27న) బెయిల్‌ పై బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వస్తూనే పిడికిలి బిగిస్తూ బయటకు వచ్చారు. అనంతరం కొడుకును హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతం జైలు వరద్దకు వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులను, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. తాను కేసీఆర్‌ బిడ్డనని, తప్పు చేయనని ప్రకటించారు. తనను ఇబ్బంది పెట్టినవారికి వడ్డీతో తిరిగి చెల్లిస్తానని శపథం చేశారు. అంతేకాకుండా.. తాను మంచిదాన్ని మొడినని, జైల్లో జెట్టి జగమొండిని చేశారని ప్రకటించారు. తన పోరాటం ఇక అన్‌బ్రేకబుల్‌ అని స్పష్టం చేశారు.

    కేసీఆర్‌కు ఫోన్..
    రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు కవిత. ఈ సందర్భంగా కారులో ఇంటికి వెళ్తుండగా తండ్రి కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. ఐదున్న నెలల తర్వాత కూతురు గొంతు వినబడగానే.. బిడ్డ.. ఎట్లున్నావ్‌ పాణం మంచిగున్నదా అంటూ కవితను క్షేమ సమాచారం అడిగారు. నాన్న అని పిలుస్తూ కవిత తన తండ్రి గొంతు విని భావోద్వేగానికి గురయ్యారు. కాసేపటి దాకా కవిత నోటి వెంట మాటలు రాలేదని, తండ్రి గొంతు వినగానే ఒక్కసారిగా కవిత కన్నీటి పర్యంతమయ్యారని సమాచారం. ఈ సందర్భంగా ఫోన్‌లో కుమార్తెతో మాట్లాడిన కెసిఆర్‌ కుమార్తెను ఓదార్చి బిడ్డ ఎట్లా ఉన్నావ్‌ .. పాణం మంచిగున్నదా అంటూ కుశల ప్రశ్నలు అడిగారు. బాధపడకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ కేసీఆర్‌ జాగ్రత్తలు చెప్పారు.

    నేడు హైదరాబాద్‌ కు కవిత..
    కవిత కూడా కేసీఆర్‌ ను మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నారా? అంటూ కుశల ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఇక తీహార్‌ జైలు నుంచి విడుదలైన కవిత నిన్నరాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నేడు మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌ చేరుకోనున్నారు. హైదరాబాద్‌ కు వచ్చిన తర్వాత వెంటనే ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్దకు కవిత వెళ్లి తండ్రిని కలవనున్నారు.

    తండ్రీ కూతురి బాండింగ్‌
    కవిత జైలు పాలు అయినప్పటి నుంచి బయటకు మాట్లాడుతున్నప్పటికీ తీవ్ర ఆవేదనలో ఉన్న కేసీఆర్‌ తన గుండెలో అగ్నిపర్వతాన్ని మోస్తున్నట్టు కవిత అరెస్టు విషయంలో స్పందించారు. తన బిడ్డ ఏ తప్పు చేయలేదని బల్లగుద్ది మరీ చెప్పారు. తాజాగా కవిత కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చీటికి మాటికి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, కూతురు అరెస్ట్‌ అయి ఐదు నెలలు జైల్లో ఉంటే.. ఒక్క రోజు కూడా వెళ్లి పరామర్శించలేదు. ఒక్కసారి శోభమ్మ వెళ్లింది. కేటీఆర్, హరీశ్‌రావు తరచూ వెళ్లి కవితతో ములాఖత్‌ అయ్యారు. లాయర్లతో మాట్లాడారు. బెయిల్‌ వచ్చేలా కృషి చేశారు.