MLC Kavitha Tweet Viral: కొద్దిరోజులుగా భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీలో కొంతమంది నాయకులపై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. తన తండ్రిని దేవుడు అంటూనే.. తనను ఇబ్బంది పెడుతున్న నాయకులను దయ్యాలు అని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి కల్వకుంట్ల కవిత స్థానంలో మరొక నాయకుడు ఉంటే కేసీఆర్ ఇప్పటికే తన పార్టీ నుంచి బయటికి పంపించేవారు. కల్వకుంట్ల కవిత ఆయన కుమార్తె కాబట్టి నిశ్శబ్దంగా ఉంటున్నారు.
కల్వకుంట్ల కవిత కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూనే.. తన మానస పుత్రిక జాగృతిని బలోపేతం చేస్తున్నారు. జాగృతి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. గత పది సంవత్సరాలుగా జాగృతి విషయంలో అంతగా సీరియస్ నెస్ చూపించని కవిత.. కొద్దిరోజులుగా జాగృతిని బలోపేతం చేస్తున్నారు. జిల్లాలకు కమిటీలు ఏర్పాటు చేశారు. సింగరేణి కార్మిక సంఘం నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకంగా తెలంగాణ అప్పటి పరిస్థితులను ఆమె చూపిస్తున్నారు.
భారత రాష్ట్ర సమితిలో తన తండ్రిని దేవుడు అని వ్యాఖ్యానించిన ఆమె.. కొంతమంది నాయకులను దయ్యాలు అని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఒక నాయకుడిని ఉద్దేశించి ఇటీవల లిల్లీపుట్ అని కూడా ఆరోపించారు. అయితే అటువంటి కవిత ఇప్పుడు సొంత పార్టీ లోకి వెళ్తున్నారా.. త్వరలో దానికి ముహూర్తం ఖరారయిందా.. ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక సర్కులర్ విడుదల చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కలవకుండా కవిత తన సామాజిక మాధ్యమ వేదికలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తెలంగాణ తల్లి విగ్రహాలను ఆమోదించేది లేదని పేర్కొన్నారు. అదే కాదు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ తల్లి విగ్రహాలు ఎక్కువ రోజులు నిలబడవని కవిత స్పష్టం చేశారు. వచ్చే రోజుల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ విగ్రహాలను సకల మర్యాదలతో గాంధీభవన్ కు పంపిస్తామని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి తిరిగే అధికారంలోకి వస్తే అనే పదాన్ని వాడారు కాబట్టి కవిత.. తిరిగి సొంత పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కెసిఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే కవిత ఆ వ్యాఖ్యలు చేశారని సమాచారం. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ కు కవిత రాఖీ కట్టని విషయం తెలిసిందే. పైగా కేటీఆర్ భారత రాష్ట్ర సమితికి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన కవిత రాకకు ఒప్పుకున్నారా.. అందువల్లే ఆమె ఇలాంటి ట్వీట్ చేశారా.. అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలు ఊరూరా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ తల్లిని ప్రజలపై రుద్దే కుట్రకు ఈ అరాచక ప్రభుత్వం తెరలేపింది.
తెలంగాణ అస్తిత్వ చిహ్నమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వేరు చేసి ఈ ప్రభుత్వం
రూపొందించిన కాంగ్రెస్ తల్లిని అన్ని జిల్లాల… pic.twitter.com/RrkcnOpjUp— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 12, 2025