https://oktelugu.com/

MLC Kavitha: కవితక్క సినిమా డైలాగ్స్‌.. భయపడుతూనే బెదిరింపులు..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరు నెలలు తిహార్‌ జైల్లో ఉన్న కవిత.. బెయిల్‌పై వచ్చాక ఆరు నెలల వరకు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారు. నాన్న ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం, అన్న అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉండడంతో పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 30, 2024 / 12:51 PM IST

    MLC Kavitha

    Follow us on

    MLC Kavitha: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ప్రతిపక్షంగా ఏడాది కూడా తన పాత్ర పోషించలేకపోతోంది. అధికారం లేకుండా తాము ఉండలేమన్నట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే త్వరలోనే ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టారు. దీంతో సైలెంట్‌ అయ్యారు. తర్వాత హామీల అమలుపై ఫోకస్‌ చేసి రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టింది. ఇలాంటి తరుణంలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈరేస్‌కు సంబంధించి రూ.56 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో ఏసీబీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై కేసు నమోదు చేసింది. ఈడీ కూడా రంగంలోకి దిగింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయం అనుకుంటున్న దశలో ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కవిత ఇప్పుడు యాక్టివ్‌ అవుతున్నారు. సినిమా డైలాగ్స్‌ను తలపించేలా కాంగ్రెస్‌ సర్కార్‌కు వార్నింగ్‌లు ఇస్తున్నారు.

    భయపడుతూనే..
    కేటీఆర్‌పై కేసు నమోదై పది రోజులు గడిచింది. ఇప్పటి వరకు దీనిపై కేసీఆర్‌ స్పందించలేదు. మరోవైపు ఏసీబీ అరెస్ట్‌ చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించుకోవాలని కోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇలాంటి తరుణంలో కేటీఆర్‌ అరెస్టు తప్పదన్న భయం గులాబీ నేతల్లో, కేటీఆర్‌ కుటుంబ సభ్యులో కనిపిస్తోంది. అయినా కవిత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌కేసులో అరెస్ట్‌ అయి ఆరు నెలలు జైల్లో ఉన్నారు. జైలు జీవితం ఎలా ఉంటుందో ఆమె భయటకు వచ్చాక కన్నీళ్లు పెట్టుకున్న తీరే నిదర్శనం. ఇప్పుడు కేటీఆర్‌ కూడా జైలు కూడు తినక తప్పే పరిస్థితి లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, తమది భయపడే రక్తం కాదని, భయపెట్టే రక్తమని డైలాగ్స్‌ కొట్టడం ఆశ్చర్య పరుస్తోంది. కేడర్‌ బలహీన పడకుండా ఉండేందుకు కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

    కారు పగ్గాలపై ఆశలు..
    మరోవైపు కేటీఆర్‌ అరెస్ట్‌ అయితే కారు స్టీరింగ్‌ చేపట్టేందుకు కవిత సిద్ధమవుతోందన్న అభిప్రాం వ్యక్తమవుతోంది. కేసీఆర్‌ ఏడాదిగా ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావడం లేదు. పార్టీలో యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే సైలెంట్‌గా ఉన్నా కేసీఆర్‌ వెనుక వ్యూహాలు రచిస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ, కొడుకుపై కేసు నమోదైనా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ తరుణంలో కేటీఆర్‌ అరెస్టు అయితే.. పార్టీని తానే లీడ్‌ చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కేసీఆర్‌ కూడా అనుమతి ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కవిత పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్‌ అవుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే భారీ డైలాగ్స్‌ పేలుస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

    పథకాలపై నిలదీత..
    ఇదే సమయంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ రేవంత్‌ సర్కార్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. డిగ్రీ చదువుఉన్న ఆడపిల్లలకు స్కటీల పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. పెన్షన్లు పెంచలేదని విమర్శించారు. తెలంగాణలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.

    మొత్తంగా కవిత పొలిటికల్‌గా యాక్టివ్‌ కావడం క్యాడర్‌లో జోష్‌ తెచ్చినా.. కేటీఆర్‌కు ఎసరు పెడతారా అన్న అభిప్రాయం, గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి.