MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రచారం ప్రారంభ దశలో బీఆర్‌ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఇంకా ఆయన పూర్తిగా కోలుకోలేదు. ఆయన తరఫున కుమారుడు, ఎమ్మెల్సీ, హరీశ్‌రావు ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇటీవ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు కొట్టుకున్నారు. కానీ, మీడియా, బీఆర్‌ఎస్ నాయకులు గువ్వల బాలరాజుపైనే దాడి జరిగినట్లు చిత్రీకరించారు. సోషల్ మీడియాలో విపక్షాలు గువ్వలను ట్రోల్ చేశాయి. ఇక మిర్యాలగూడలో బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డిపై దాడిచేశారు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే.. తాజాగా సీఎం తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా.. రాయికల్ మండలం ఇటిక్యాలలో.. ప్రచార వాహనంలో స్పృహ కోల్పోయారు.
సంజయ్ తరఫున ప్రచారం..
కవిత రెండు రోజులుగా కోరుట్ల, జగిత్యాల బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు దీంతో ఇక్కడ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. శనివారం జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని రాయికల్‌లో ప్రచారానికి వచ్చారు. రోడ్ షోలో పాల్గొన్నారు. ఐతే.. ఆమె బాగా నీరసించిపోయి, కళ్లు తిరిగి పడిపోయారు. తోటి కార్యకర్తలు సపర్యలు చేసిన తర్వాత.. కాసేపటికే ఆమె కోలుకొని.. తిరిగి ప్రచారం ప్రారంభించారు.
మూడు రోజులుగా ప్రచారంలో..
ఇదిలా ఉండగా మూడు రోజులుగా కవిత ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రచారం చేస్తున్నారు. ఐతే.. శనివారం జగిత్యాల జిల్లాలో ఎండ బాగా ఉంది. అలాంటి చోట ఆమె ప్రచారం చేస్తూ.. నీరసించిపోయిం ప్రచార వాహనంలోనే సొమ్మసిల్లి పడిపోయారు. గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తున్నందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని తోటి నేతలు, కార్యకర్తలూ చెబుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్.. స్వతహాగా డాక్టర్ కావడంతో.. ఆమెను పరిశీలించి.. తగిన చర్యలు తీసుకోవడంతో.. ఆమె త్వరగా కోలుకున్నారు.
పీకే ప్లానేనా..
ఇదిలా ఉండగా, కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి, గువ్వల బాలరాజుపై దాడి, తాజాగా కవిత అస్వస్థతకు గురికావడం చూసి.. విపక్ష నాయకులు సోషల్ మీడయాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక ప్రకారం బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల తరహాలో, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారని పేర్కొంటున్నారు. అందులో భాగంగానే దాడులు, అస్వస్థత ఘటనలు జరుగుతున్నాయంటున్నారు. బెంగాల్ ఎన్నికల్లోనూ దీదీ మమతాబెనర్జీ కాలుకు పట్టి కట్టుకుని ప్రచారం చేసి పార్టీని గెలిపించారని, ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు ఆదేబాటలో నడుస్తున్నారంటున్నారు. కొన్ని రోజుల్లో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ కూడా కొత్త డ్రామాలు ఆడతారని అంటున్నారు.