Telangana MLAs dissatisfaction: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. కానీ, పార్టీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు చేయడం హస్తం పార్టీలో కామనే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేతలు పద్ధతి మార్చుకోవడం లేదు. తాజాగా సొంత మంత్రుల తీరుపైనే ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.నియోజకవర్గ సమస్యలు చర్చించడానికి కలవడానికి వెళ్తే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. గంటల తరబడి కూర్చోబెట్టి, కలిసినా పొడిగా స్పందించి అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
ఫోన్లు ఎత్తడం లేదని…
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు జిల్లా మంత్రుల అహంకారంపై ఆందోళన చెందుతున్నారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని, కలవడానికి వెళితే సమయం ఇవ్వడం లేదని బాధపడుతున్నారు. తరచూ ఇలాగే చేస్తున్నారని, కావాలని చేస్తున్నట్లు ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటి మంత్రుల కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
కొత్త మంత్రులు కావాలి..
ప్రస్తుత జిల్లా మంత్రుల తీరుతో విసిగిపోతున్నామని, పార్టీ క్యాడర్లోనూ నైరాష్యం నెలకొందని బాధపడుతున్నారు. మంత్రి అండగా ఉంటే కార్యడర్ దేనికైనా సిద్ధంగా ఉంటుందని, కార్యకర్తల కారణంగానే ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గెలిచిన తర్వాత పదవి రావడంతో కళ్లు నెత్తికెక్కినట్లు వ్యవహరిస్తున్నారు అని హస్తం నేతలు గుసగుసలాడుతున్నారు. పార్టీలో ఐక్యత కోల్పోకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రుల వ్యవహారం మారాలని కోరారు. ఈ అంతర్గత గొడవ ప్రభుత్వంలో మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా.
ఆ మంత్రులు మాకొద్దు.. వెంటనే మార్చండి
మంత్రులపై సీఎంకి, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు
కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన
మా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి వెళితే ఆ ముగ్గురు మంత్రులు రిసీవ్ చేసుకునే విధానం… pic.twitter.com/SPh588MsyS
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025