HomeతెలంగాణMiryalaguda Municipality: వెనుకంజలో వీర సైనికుల కుటుంబ సభ్యులు..

Miryalaguda Municipality: వెనుకంజలో వీర సైనికుల కుటుంబ సభ్యులు..

Miryalaguda Municipality: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ మూడు మున్సిపాలిటీలను గెలచుకుంది. కాంగ్రెస్‌ 8 మున్సిపాలిటీలను తన ఖాతాల్లో వేసుకుంది. ఇక ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది.

వీరసైనికుల కుటుంబాలు పోటీ..
ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో వీర సైనికుల కుటుంబాలు పోటీ చేశాయి. గాల్వన్‌ ఘటనలో మరణించిన సంతోష్‌కుమార్‌ తల్లి మంజుల ఈసారి బీఆర్‌ఎస్‌ తరఫున మున్సిపల్‌ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి బరిలో నిలిచారు. ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో మంజుల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి దూకుడు కొనసాగుతోంది.

కార్గిల్‌ వీర సైనికుడు కూతురు…
ఇక మిర్యాలగూడ మున్సిపాలిటీలోనే కార్గిల్‌ అమర సైనికుడు చాచారి కూతురు మౌనిక బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ఆధిప్యతం కనబరుస్తోంది. బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు.

హస్తం దూకుడు..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. మిర్యాల గూడ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఒక్కరే బీఆర్‌ఎస్‌. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితే కనిపిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ జగదీశ్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగానే వస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version