Homeఆధ్యాత్మికంArunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి అరుణాచలానికి క్యూ కడుతున్నారు. చివరికి తమిళ భక్తుల కంటే ఎక్కువగా తెలుగు వాళ్లే అధికంగా అరుణాచలం వెళ్తున్నారు. భక్తుల తాకిడి తట్టుకోలేక కొన్ని సందర్భాలలో గిరిప్రదక్షిణ గంటల తరబడి ఆలస్యం అవుతుంది. దీనిని బట్టి తెలుగు వాళ్ళు అరుణాచలానికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

అరుణాచలంలో గిరిప్రదక్షిణ అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ తర్వాత భక్తులు అత్యంత ముఖ్యంగా భావించేది మోక్షమార్గం. ఇందులో నుంచి బయటికి వస్తే.. మోక్షం లభిస్తుందని.. పాపాల నుంచి విముక్తి సాధ్యమవుతుందని భక్తులు నమ్ముతుంటారు. అదే మోక్ష మార్గం అత్యంత ఇరుకుగా ఉంటుంది. ఇందులోంచి బయటికి రావడం అంటే అంత సులభం కాదు. జీవితంలో పడిన కష్టాలకు.. నష్టాలకు.. దుఃఖాలకు.. సుఖాలకు ప్రతీకగా మోక్షమార్గం ఉంటుంది. అందులో నుంచి వచ్చిన తీరును బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుందని ప్రవచన కారులు చెబుతుంటారు.

పైగా చాగంటి కోటేశ్వరరావు ఇందులో నుంచి రావడం పూర్వజన్మల సుకృతమని చెప్పడంతో.. తెలుగు భక్తులు ఎక్కువగా మోక్షమార్గం నుంచి రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. లావు ఎక్కువగా ఉన్న వ్యక్తులు సైతం మోక్షమార్గం నుంచి బయటికి రావాలని భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ నమ్మకమే భక్తుల ప్రాణాల మీదికి తీసుకొస్తోంది. ఇటీవల రాజమండ్రి కి సంబంధించిన ఒక భక్తుడు మణికుమార్ ఈనెల 24న మోక్షమార్గంలో ఇరుక్కుపోయి చనిపోయాడు. ఆ సంఘటన మర్చిపోకముందే ఏపీ రాష్ట్రానికి చెందిన మరో భక్తురాలు ఇదే తరహాలో మోక్షమార్గంలో చిక్కుకుపోయింది. బయటికి రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు బయటకు రావడానికి ప్రయత్నాలు చేశారు. అనేక ప్రయత్నాల తర్వాత ఆమెను సురక్షితంగా బయటికి లాగారు.. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

మోక్షమార్గం అత్యంత ఇరుకుగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు లావుగా ఉన్న వ్యక్తులు అందులో నుంచి రావాలని అనుకోకపోవడమే మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. రాజమండ్రి భక్తుడు మణికుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు లావుగా ఉండడంతో అందులో నుంచి రాలేకపోయాడు. శ్వాస ఆడక పోవడంతో.. గుండె ఆగి చనిపోయాడు. అందువల్లే మోక్షమార్గంలో నుంచి బయటికి రావాలనే భక్తులు తమ శారీరక స్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అక్కడి పూజారులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...

Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్ అవుతాయి..

Bike Mileage Tips: ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్తగా టూ వీలర్ కొనాలని అనుకునేవారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు చూస్తున్నారు. అయితే...
Oktelugu Epaper
Exit mobile version