Mirjaguda road accident: మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో 20 మంది చనిపోయారు. ఆర్టీసీ బస్సును కంకరలోడుతో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. సోమవారం ఉదయం 6:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది దాకా చనిపోయారు. టిప్పర్ ఢీ కొట్టిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. కొందరి మృతదేహాలు కంకరలో చిక్కుకుపోయాయి. బస్సులో మృత దేహాలు చిక్కుకుపోవడంతో జెసిబి ని తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
ఈ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. తాండూరు పట్టణం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎల్లయ్య గౌడ్ తన ముగ్గురు కుమార్తెలను ఈ ప్రమాదంలో కోల్పోయారు. ఎల్లయ్య గౌడ్ కు తనుషా, సాయి ప్రియ, నందిని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు ముగ్గురు ఇటీవల వేడుక నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత వారు తిరిగి వెళ్ళిపోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు వారు ముగ్గురు కూడా బస్సులోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండడం కన్నీరు పెట్టిస్తోంది.. ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీసీ బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు.
తనుష ఎంబీఏ చదువుతోంది. సాయి ప్రియ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంది. నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బంధువుల పెళ్లి నేపథ్యంలో వీరు ముగ్గురు తాండూరు వచ్చారు. సోమవారం ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులో ముందు వరస సీట్లలో వారు కూర్చున్నారు. బస్సును టిప్పర్ ఢీకొన్న వెంటనే వారు ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. ముగ్గురు కుమార్తెలు చనిపోవడంతో ఎల్లయ్య గౌడ్ దంపతులు గుండెలు పగిలే విధంగా రోధిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో పెద్ద కుమార్తెకు పెళ్లి చేయాలని ఎల్లయ్య గౌడ్ నిర్ణయించుకున్నాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. కానీ ఇంతలోనే ఊహించని విషాదం వారి కుటుంబంలో తీవ్రమైన వేదనను మిగిల్చింది. ఉన్న ముగ్గురు కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు..
ముగ్గురు కుమార్తెలు విగత జీవులుగా పడి ఉండడంతో ఎల్లయ్య గౌడ్ బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ముగ్గురు కుమార్తెలు కూడా చదువుల్లో చురుకు. వీరు ముగ్గురు చదువుల్లో మెరుగ్గా ఉండడంతో.. హైదరాబాదులోనే ఉంచి ఎల్లయ్య గౌడ్ చదివిస్తున్నాడు. వారికోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు. ఎదిగి వచ్చిన పిల్లలు ఇలా చూస్తున్న గాని రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఎల్లయ్య గౌడ్ దిక్కులు పిక్కటిల్లే విధంగా రోదిస్తున్నాడు.
#BusAccident in #Telangana —
Three daughters of Yellayya Goud, a resident of Gandhinagar in Tandur town, lost their lives in the bus accident that occurred in Chevella mandal.
Three sisters : Tanusha, Sai Priya, and Nandini were travelling in the bus at the time of the… pic.twitter.com/qe2bitrzBU
— NewsMeter (@NewsMeter_In) November 3, 2025