https://oktelugu.com/

తెలంగాణ మనసులను దోచుకున్న మెగాస్టార్ !

తెలంగాణలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాల సందడి మొదలైంది. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు’ అంటూ చెప్పుకొచ్చిన చిరు, ‘వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి తనదైన […]

Written By:
  • admin
  • , Updated On : July 11, 2021 / 04:13 PM IST
    Follow us on

    తెలంగాణలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాల సందడి మొదలైంది. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు’ అంటూ చెప్పుకొచ్చిన చిరు,

    ‘వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి తనదైన శైలిలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. మెగాస్టార్ మొత్తానికి ఈ ట్వీట్ తో తెలంగాణ అభిమానుల మనసును దోచుకున్నారు.

    చిరంజీవి ప్రస్తుతం ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఆ మధ్య రిలీజ్ అయిన ప్రత్యేక పాట ‘లాహే లాహే’ విపరీతమైన బజ్ తో పాటు ఇప్పటకే 60 మిలియన్ల రికార్డ్ వ్యూస్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ మధ్యలో వేసిన చిరు క్రేజీ స్టెప్స్ ప్రేక్షకుల్ని చాల బాగా ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది.

    ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటం, అలాగే చరణ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడంతో ఆచార్య పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అన్నట్టు మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.