https://oktelugu.com/

Mega DSc : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో మరో డీఎస్సీ.. ఈసారి ఎన్ని పోస్టులంటే…

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది గురుకుల పోస్టులతోపాటు, డీఎస్సీ నిర్వహించింది.వేలాది పోస్టులు భర్తీ చేసింది 2025లో మరో డీఎస్సీ ప్రటించేందుకు కసరత్తు చేస్తోంది.

Written By: , Updated On : December 15, 2024 / 12:05 PM IST
Mega Dsc Notification

Mega Dsc Notification

Follow us on

Mega DSc : తెలంగాణలో 2024లో గురుకుల ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన రెండునెలలకే మెగా డీఎస్సీ ప్రకటించింది. 11,063 ఉద్యోగాలతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది జూలై, ఆగస్టులో పరీక్ష నిర్వహించి అక్టోబర్‌లో ఉద్యోగాలు భర్తీ చేసింది. అయితే గురుకుల, డీఎస్సీ పోస్టుల భర్తీ తర్వాత కూడా బ్యాక్‌లాగ్‌ పోస్టులు మిగిలిపోయాయి. దీంతో మరో డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఇటీవలే టెట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. 2025, జనవరి లేదా ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చే అవకాశం ఉంది.

వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ..
2024లో ఉపాధ్యాయ పోస్టులతోపాటు వివిధ కేటగిరీల్లో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. గడిచిన పదేళ్లు ఎలాంటి నోటిషికేషన్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించి, ఫలితాలు ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేసింది. ఏడాదంతా ఉద్యోగాల జాతర కొనసాగింది. ఇందులో గ్రూప్‌–4తోపాటు పోలీస్, వైద్య శాఖ, ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసింది. తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 6 వేల ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

డిప్యూటీ సీఎం ప్రకటన..
ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ నోటిఫికేషన్‌పై కీలక ప్రకట చేశారు. ఇటీవలే డీఎస్పీ నియామకాలు పూర్తయ్యాయని, మరో డీఎస్సీ ద్వారా 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన పరీక్షలో విఫలం అయిన వారికి ఇది లక్కీ ఛాన్స్‌ అని చెప్పాలి. ఉపాధ్యాయ కొలువు కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఇక వెంటనే పుస్తకం పట్టాలి.