https://oktelugu.com/

Electric scooter : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 100 శాతం క్యాష్ బ్యాక్.. డిసెంబర్ 22 లోపే..

తాజాగా TVS కంపెనీ తన స్కూటర్ పై బంఫర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా స్కూటర్లపై 20 శాతం లేదా 50 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తుంటాయి. కానీ ఈ స్కూటర్ పై ఏకంగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదెలాగో తెలుసుకోండి.

Written By:
  • Srinivas
  • , Updated On : December 15, 2024 / 12:09 PM IST

    TVS IQUBE Electric scooter

    Follow us on

    Electric scooter : ప్రస్తుతం టూవీలర్ కొనాలని అనుకునేవారు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు సైతం ఎక్కువ మొత్తంలో వీటికి సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఉండడంతో పాటు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మార్కెట్లో ఈవీ స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ కంపెనీలు తమ ప్రొడక్ట్ సేల్స్ ను పెంచుకునేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా TVS కంపెనీ తన స్కూటర్ పై బంఫర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా స్కూటర్లపై 20 శాతం లేదా 50 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తుంటాయి. కానీ ఈ స్కూటర్ పై ఏకంగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదెలాగో తెలుసుకోండి.

    ఎలక్ట్రిక్ వేరియంట్ లో TVS స్కూటర్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన IQUBE సంచలనం సృష్టించింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని 4.50 లక్షల మంది కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ద్వారా కంపెనీ భారీగా లాభాలను నమోదు చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ ను వినియోగాదారుతో చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ మోడల్ పై 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 100శాతం క్యాష్ బ్యాక్ ప్రతీ స్కూటర్ పై కాదు. ఎలాగంటే?

    సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో కంపెనీలు తమ ఉత్పత్తులు అధిక సేల్స్ కావడానికి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. కానీ టీవీఎస్ కంపెనీ ప్రస్తుతం వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. TVS IQUBE స్కూటర్ పై లక్కీడ్రాను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 12 నుంచి 22 వరకు ఈ మోడల్ కొనుగోలు చేసిన వారిలో ప్రతి నెల డ్రా తీసి ఒకరిని ఎంపిక చేస్తారు. వీరు టీవీఎస్ వెబ్ సైట్ లేదా డీలర్ షిప్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ లక్కీడ్రాలో విజేతకు 100 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. వీటితో పాటు రూ.30 వేల గ్యారెంటీ బెనిఫిట్స్ అందించనుంది.

    ఎలక్ట్రిక్ స్కూటర్ అది ఐ క్యూబ్ కొనుగోలు చేయాలని అనుకునే వారు ఈ సమయంలో కొనుగోలు చేస్తే వారికి 100 శాతం రిటర్న్ నగదు వచ్చే అవకాశం ఉంది. ఇందలో 3.4 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. ఇది ఐదేళ్లవరకు లేదా 70 వేల కిలో మీటర్ల వరకు వారంటీ ఉంటుంది. అదే 2.2 కిలో వాట్ బ్యాటరీపై ఐదేళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వరకు వారంటీని ఇస్తారు. క్రిస్మర్, న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేకాకుండా 100 శాతం క్యాష్ బ్యాక్ ఇప్పటి వరకు ఏ కంపెనీ ప్రకటించలేదని అంటున్నారు. టీవీఎస్ ఐ క్యూబ్ కు మార్కెట్లో ఆదరణ ఉన్నప్పటికీ వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని టీవీఎస్ డీలర్లను సంప్రదించాలని అంటున్నారు.