HomeతెలంగాణMahalaxmi Scheme: 18.86 లక్షల మంది ఖాతాల్లోకి సబ్సీడీ నగదు జమ..

Mahalaxmi Scheme: 18.86 లక్షల మంది ఖాతాల్లోకి సబ్సీడీ నగదు జమ..

Mahalaxmi Scheme: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు ఫిబ్రవరి 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన వారి నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 లక్షల మంది లబ్ధి పొందారు. ఇప్పటి వరకు 21 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు.

2023 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించారు. ఈగ్యారెంటీలో రెండు హామీలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఉచిత బస్సు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఉచిత బస్సును ప్రారంభించారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతులు, మహిళలు ఆధార్ కార్డు చూపిస్తు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఇదే మహాలక్ష్మీ పథకంలో రెండో హామీ రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. దీనిని ఫిబ్రవరి 27న ప్రారంభించారు. అప్పటి వరకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తరువాత 38,33,615 మంది అర్హులుగా తేల్చింది. వీరు ముందుగా గ్యాస్ సిలిండర్ ను అప్పుడున్న ధరకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వారి ఖాతాల్లోకి రూ.500 పోను మిగతా మొత్తం రిటర్న్ గా వస్తుంది.

ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18,86,045 మంది ఖాతాల్లోకి రూ.500 మినహా మిగతా మొత్తం నగదు జమ అయింది. ఇంకొందరు రెండో సిలిండర్ తీసుకొని రాయితీ పొందారు. ఇలా మొత్తం 21,29,460 మంది ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తం వేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే చాలా మంది దరఖాస్తు చేసుకున్నా సబ్సిడీని పొందలేదు. అలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version