Lok Sabha Election 2024
Lok Sabha Election 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఒక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ గురువారం(ఏప్రిల్ 26న) పూర్తయింది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు సమయం ఉంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
భారీగా నామినేషన్లు..
ఇదిలా ఉండగా నామినేషన్ల చివరి రోజు గురువారం(ఏప్రిల్ 26న) అన్ని నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా 1,488 నామినేషన్లు వచ్చాయి. ఇక తెలంగాణలోని 17 స్థానాల్లో ప్రస్తుతం 9 బీఆర్‌ఎస్ ఖాతాలో ఉండగా, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎ 1 స్థానంలో గెలిచాయి.
షెడ్యూల్‌కు ముందే కాంగ్రెస్ స్థానాలు ఖాళీ..
ఇదిలా ఉంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కాంగ్రెస్ 2019లో తెలంగాణలో గెలిచిన మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. రేవంత్ పోటీ చేసిన మల్కాజ్‌గిరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలిచిన నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన భువనగిరి స్థానాలకు వారు రాజీనామా చేశారు. ముగ్గురూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ ఛాలెంజ్‌గా తీసుకుంది. జాతీయ నాయకత్వం కూడా భారీగా ఆశలు పెట్టుకుంది. తెలంగాణ, కర్ణాటకలో మెజారిటీ సీట్లు గెలవాలని భావిస్తోంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి సర్వశక్తలు ఒడ్డుతున్నారు.
మల్కాజ్‌గిరిలో అత్యధిక నామినేషన్లు..
ఇదిలా ఉండగా, 2019లో రేవంత్‌రెడ్డి పోటీ చేసిన మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి ఈసారి డిమాండ్ పెరిగింది. మినీ ఇండియాగా భావించే ఇక్కడ అన్నిరకాల ప్రజలు ఉంటారు. అన్ని రాష్ట్రాలవారు ఉంటారు. దీంతో ఇక్కడి నుంచి పోటీచేస్తే స్థానికత అంశం ప్రభావం చూపదని చాలా మంది భావిస్తారు. అందుకే ఈసారి ఇక్కడి నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా 177 నామినేషన్లు దాఖలయ్యాయి. దీని తర్వాత నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలు రెండో స్థానంలో నిలిచాయి. ఈ నియోజకవర్గాల్లో 114 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇత మూడో స్థానంలో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నిలిచింది. ఇక్కడ 109 నామినేషన్లు వచ్చాయి.
మిగతా నియోజకవర్గాల్లో ఇలా..
ఇక రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్లు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 42, కరీంనగర్ – 94, నిజామాబాద్–90, జహీరాబాద్–68, మెదక్–90, సికింద్రాబాద్–75, హైదరాబాద్–85, చేవెళ్ల–88, మహబూబ్‌నగర్–72, వరంగల్–89, మహబూబాబాద్–56, ఖమ్మం–72 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Lok sabha elections 177 nominations were filed in malkajgiri parliament
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com