Lok Sabha Election Results 2024: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. తొలి ఫలితం మధ్యాహ్నం 1 గంట వరకు వెలువడే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. గరిష్టంగా హైదరాబాద్, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో 24 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. అత్యల్పంగా నిజామాబాద్‌లో 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది.
భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌రెడ్డి పూజలు..
కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్‌రెడ్డి మంగళవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని తెలిపారు.
కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా…
తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది.
– ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేశ్ ముందంజలోఉన్నారు.
– మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్లలో భారీ ఆధిక్యం సాధించారు.
– సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజలో ఉన్నారు.
– కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పోస్టల్ బ్యాటెల్‌లో లీడ్ సాధించారు.
– మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి అరుణ ముందు వరుసలో ఉన్నారు.
– నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యత కనబర్చారు.
– కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి అభ్యర్థి వంశీ ముందంజలో ఉన్నారు.
– ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
– వరంగల్ లోక్‌సభ స్థానంలో కడియం కావ్య ఆధిక్యంలో ఉన్నారు.