Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యం కనబరుస్తున్నారు. వారణాసిలో మోదీ పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యం కనబర్చారు. గాంధీనగర్‌లో అమిత్‌షా, నాగపూర్‌లో నితిన్‌గడ్కరీ లీడ్‌లో ఉన్నారు. మీర్‌పూర్‌లో అనురాగ్ ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు.
– హిమాచల్ ప్రదేశ్ నుంచి మండి నియోజకవర్గం బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి, నటి కంగనారనౌత్ పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యంలో ఉన్నారు.
– మహారాష్ట్రలో బారామతి నుంచి పోటీ చేసిన ఎన్‌సీపీ నేత సుప్రియాసలే ఆధిక్యంలో ఉన్నారు.
– ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పూరిలో అఖిలేష్‌యాదవ్ సతీమని డింపుల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
– పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెరర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు.
కేరళలో కాంగ్రెస్ లీడ్..
ఇక కేరళ రాష్ట్రంలోని వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోస్టల్ బ్యాలెట్‌లో లీడ్‌లో ఉన్నారు. తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ముందంజలో ఉన్నారు.
– కర్ణాటకలో మాండ్య నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి లీడ్‌లో ఉన్నారు.