https://oktelugu.com/

Lok Sabha Election Results: 8..8..8.. కమలానికి కలిసొచ్చిన నంబర్‌!

తెలంగాణలో బీజేపీ లక్కీ నంబర్‌ 8 అనిపిస్తుంది. ఎందుకంటే.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలుగా గెలిచారు. దీంతో తెలంగాణో బీజేపీకి 8 కలిసి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 6, 2024 / 12:30 PM IST

    Lok Sabha Election Results

    Follow us on

    Lok Sabha Election Results: ప్రతీ మనిషికి లక్కీ నంబర్‌ ఉంటుంది. ఆ నంబర్‌ తమకు కలిసి వస్తుందని భావిస్తుంటారు. ఇక కొని పార్టీలకు కూడా కొన్ని నంబర్లు కలిసి వస్తుంటాయి. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6. అందుకే ఆయన ఏ పని చేసిన 6 నంబర్‌ ఉండేలా చూసుకుంటారు. చివరకు తెలంగాణలో జిల్లాలను కూడా 6 వచ్చేలా 33 ఏర్పాటు చేశారు. ఇక కొందరికి ఎంచుకోకపోయినా.. కొన్ని నంబర్లు లక్కీగా మారతాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి 8 లక్కీ నంబర్‌గా మారింది.

    అసెంబ్లీలో 8.. లోక్‌సభలో 8..
    తెలంగాణలో బీజేపీ లక్కీ నంబర్‌ 8 అనిపిస్తుంది. ఎందుకంటే.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలుగా గెలిచారు. దీంతో తెలంగాణో బీజేపీకి 8 కలిసి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.

    ఏపీలో 8..
    ఇక ఏపీలో కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లోనూ బీజేపీ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. పొత్తులో బీజేపీకి 10 సీట్లు కేటాయించగా.. అందులో 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితోపాటు 3 ఎంపీ స్థానాలనూ బీజేపీ గెలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్కీ నంబర్‌ 8 అని సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

    8 కలిసొచ్చిందా..
    తెలంగాణలో తమకు ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు డబుల్‌ అవుతాయని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో తెలిపారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా కూడా ఓ ఇంటర్వ్యూలో తాము తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని ప్రకటించారు. మోదీ, నడ్డా చెప్పినట్లుగానే 8 మంది ఎంపీలుగా గెలిచారు. ఇక ఏపీలో కూడా 4 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని జేపీ.నడ్డా తెలిపారు. అదృష్టం కలిసి వచ్చి.. ఇక్కడ కూడా 8 స్థానాల్లో గెలిచారు. దీంతో బీజేపీకి 8 లక్కీ నంబర్‌గా మారిందన్న చర్చ జరుగుతోంది.