Seethakka Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అలాగే పది మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మంత్రులుగా దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు.
సీతక్క ప్రమాణం..
రేవంత్‌రెడ్డి ఎనుముల రేవంత్‌రెడ్డి అనే నేను అని అనగానే ఎల్బీ స్టేడియం హోరెత్తింది. తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. 8వ మంత్రిగా సీతక్క ప్రమాణానికి వేదికపైకి రాగానే అంతే స్థాయిలో స్టేడియం హోరెత్తింది. అక్కడికి వచ్చిన ప్రజలు కాంగ్రెస్ నాయకులు సీతక్కను చూసి చప్పట్లు, విజిల్లు, నినాదాలతో హోరెత్తించారు. దీంతో సీతక్క అందరికీ అభివాదం చేశారు. దీంతో మళ్లీ అందరూ హోరెత్తించారు. ఇంతలో గవర్నర్ తమిళిసై ‘అనే నేను’ అన్నారు. అయినా స్టేడియంలో హోరు తగ్గలేదు. దీంతో సీతక్క స్టేడియం నలువైపులా చూస్తూ.. అందరికీ అభివాదం చేశారు. అలస్యం అవుతుండడంతో గవర్నర్ జోక్యం చేసుకుని ప్రమాణం చేయాలని సైగ చేశారు. దీంతో సీతక్క.. దనసరి అనసూయసీతక్క అనే నేను.. అన్నారు. దీంతో మరోమారు అరుపులతో స్టేడియం మార్మోగింది. ఇలా రేవంత్ తర్వాత అంతకన్నా ఎక్కువగా సీతక్క ప్రమాణం సమయంలో హెరెత్తింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దనసరి అనసూయ(సీతక్క) ఇద్దరు మనస్సాక్షిగా ప్రమాణం చేశారు. మిగతా అందరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఆత్మీయ ఆలింగనం..
ఇదిలా ఉండగా రేవంత్ మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేసిన ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కాంగ్రెస్ అగ్రనేతను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ప్రమాణం అనంతరం రేవంతరెడ్డికి నమస్కరించి, తర్వాత గవర్నర్‌కు నమస్కరించారు. తర్వాత నేరుగా సోనియాగాంధీ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత సోనియాగాంధీ నిలబడి ఇద్దరు మహిళా నేతలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
Web Title: Lb stadium roared when seethakka took oath
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com