Hyderabad : హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో వందలాది పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో చాలావరకు లేఅవుట్లు ఉన్నాయి. అయితే వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని వార్తలు వస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ నగర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దీంతో లే అవుట్లు వేసిన యజమానులు.. వాటిని కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడక ముందే హైదరాబాద్ నగర్ శివారులోని చాలా పంచాయతీలలో లేఅవుట్లు వేశారు. ఇందులో బాలాపూర్, కమ్మగూడ, మన్నెగూడ, ఆదిభట్ల, మంగళపల్లి, అబ్దుల్లా పూర్ మెట్, గుర్రం గూడ, నాదర్ గుల్, తుర్క యాంజిల్, వంటి గ్రామాలలో వందలాదిగా పంచాయతీ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. అయితే వీటిని హెచ్ఎండిఏ ఏర్పడక ముందే ఏర్పాటు చేశారు. ఆపై విక్రయించారు కూడా. హెచ్ఎండిఏ తెరపైకి వచ్చిన తర్వాత ఈ లేఅవుట్లలో చాలా వరకు క్రమబద్ధీకరించారు. ఇందులో ఏకంగా భారీ భవంతులు నిర్మించారు. నగరం విస్తరించడంతో ఇవన్నీ కూడా అత్యంత విలువైనవిగా మారాయి. అయితే ఇందులో కొన్ని లేఅవుట్లను క్రమబద్ధీకరించలేదు. ఇందులో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వారు కొనుగోలు చేసిన భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయని వార్తలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. సామాజిక మధ్యమాలలో వీటిపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కొనుగోడు దారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం..
హెచ్ఎండీఏ అధికారులు ఈ లేఅవుట్లను “ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం” ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చారు. సెక్షన్ 22 ఏ (1)(ఈ) కింద బ్లాక్ లిస్ట్ లో పెట్టామని అధికారులు పేర్కొన్నారు. ఈ జాబితాలో ఉన్న భూములు, లే అవుట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయదు. పైగా ఆ సర్వే నెంబర్లలో ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారుల వద్దకు వస్తే అడ్డగించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అనధికారిక లే అవుట్లను.. వివాదాలు ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి లేఅవుట్ల వల్ల భూవివాదాలు పెరిగిపోతుండడం.. కోర్టులలో కేసులు నడుస్తుండడం వల్ల ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూముల యజమానులు భయపడిపోతున్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో వారంతా ఆందోళనలో కూరుకు పోయారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Layouts under hmda are in the restricted list if they apply to lrs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com