KTR Satire On Kadiyam: తెలంగాణ రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత కడియం శ్రీహరి ఇటీవల వైరల్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్‌లోకి చేరిన ఆయన పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనను విమర్శలపాలు చేస్తున్నాయి.
Also Read: రాహుల్ జీ.. ఎన్నిరోజులు ఈ కాకమ్మ కథలు!
ఒక టీవీ చానెల్ జర్నలిస్టు కడియం ను ప్రశ్నిస్తూ “మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?” అని అడిగాడు. దానికి ఆయన చెబితే వేటు పడుతుందేమోనని భయపడి తెలివిగా “ఏ పార్టీలో ఉండాలో, అదే పార్టీలో ఉన్నాను” అనే జవాబు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలో దాగిన వ్యంగ్యాన్ని చాలామందికి అర్థం కాలేదు. కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం దీన్ని పసిగట్టారు. ఘాటుగా స్పందించారు.
-కేటీఆర్ సెటైర్ – “పార్టీ పేరు చెప్పడానికే భయపడుతున్నారని!”
ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తూ “ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని స్థితిలో ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారుతున్నారు. కాంగ్రెస్‌లో చేరామని ధైర్యంగా చెప్పలేరు. ఎందుకంటే సుప్రీంకోర్టు అర్హత రద్దు చేసే అవకాశం ఉందని వాళ్లకు భయం. అటువంటప్పుడు, ‘ఏ పార్టీలో ఉండాలో అదే పార్టీలో ఉన్నా’ అనడం చూసి నవ్వొస్తోంది,” అంటూ ఎద్దేవా చేశారు.
– సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తక్కువ సమయంలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. “ఒక్క లైన్ లోనే కడియం శ్రీహరిని కడిగేశారు”, “సూటిగా గుచ్చే సెటైర్ ఇది”, అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాజకీయ చరిత్రపై ప్రజల మదింపు
వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కొన్నది నిజం. ఇప్పుడు అదే పరిస్థితిని కాంగ్రెస్ అనుసరిస్తోంది. ప్రజలు మాత్రం ఈ రెండూ చూసి విసుగుతో, వంగ్యంతో స్పందిస్తున్నారు. కేటీఆర్ సెటైర్ ఫన్నీగా ఉన్నా సత్యం మాత్రం చాలామందిని ఆలోచనలో పడేస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మార్పులు, ఫిరాయింపులు కొత్త విషయం కాకపోయినా, వాటిపై వచ్చే విమర్శలు, సెటైర్లు మాత్రం కొత్త కోణాలను తీసుకువస్తున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలు కడియం శ్రీహరికి బదులుగా కాకపోయినా, ప్రజల దృష్టిలో ఉన్న అసహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఈ ఒక్క మాటతో రాజకీయ విమర్శలకు ఊపొస్తూ “పార్టీ మారినా, మాటలు మాత్రం మళ్ళీ మారిపోయాయి” అనిపించేలా చేశాయి.
CM Revanth took 10 BRS MLAs into Congress who in fear of Supreme Court are not even telling out to Media in which party currently they are
– @KTRBRS pic.twitter.com/RlbEIZ2GQX
— Dr.Krishank (@Krishank_BRS) August 7, 2025