KTR: ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో ఇప్పుడు సంచలన విషయం ఇదే. రోజుకో మలుపు తిరుగుతూ ట్విస్టుల మీద ట్విస్టులతో నిత్యం పత్రికల్లో పాతక శీర్షికన ఉంటోంది. ఇప్పటి వరకు పోలీసుల మెడకే చుట్టుకున్న ఈ అంశం ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలకు తాగే అవకాశం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటోంది. బీఆర్‌ఎస్ నేతల పేర్లు చెప్పే వరకూ పోలీసుల అరెస్టులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. దీంతో దీనిపై మాజీ ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. ఈసారి అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు.
మొన్న తప్పేంటని..
ఇటీవల ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించిన కేటీఆర్.. చేస్తే ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని కేటీఆర్ పరోక్షంగా ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకున్నారు. దొంగల ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల పని అని కూడా ప్రకటన చేశారు. ప్రజల సంక్షేమాన్ని వదిలేసి ఫోన్ ట్యాపింగ్ పేరుతో కుట్రలకు తెరతీస్తోందని ఆరోపించారు.
మరోవైపు పెరుగుతున్న ఫిర్యాదులు..
ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్‌పై పోలీసులకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌తోపాటు బీజేపీ నేతలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మొన్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఆ తర్వాత బీజేపీ నేత రఘునందన్‌రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసినవారిపై ఫిర్యాదు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే అరెస్టు అయిన డీఎస్పీ అంగీకరించారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తొలి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీశ్‌రావును, మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని కోరారు.
మళ్లీ స్పందించిన కేటీఆర్..
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ మళ్లీ స్పందించారు. కాదు.. ఏకంగా వార్నింగే ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలతోపాటు మంత్రిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిచంఆరు. నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తనపై నిరాధార వార్త రాసిన పత్రికపైనా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఇది బీఆర్‌ఎస్ రాజ్యం కాదు సారూ..
ఇదిలా ఉంటే.. కేటీఆర్ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయకుండా కేసులు పెట్టించడం, కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం కేటీఆర్‌కు అలవాటే. కానీ ఇప్పుడు అధికారం మారింది. అయినా తాము ఇంకా అధికారంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కే టీఆర్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. దానికి బదులు తీర్చుకోవాలి అన్నట్లుగా గులాబీ నేత తీరు ఉందని పలువురు పేర్కొంటున్నారు.