Aghori Srinivas: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘అఘోరీ శ్రీనివాస్'(Aghori Srinivas) ని అంత తేలికగా మర్చిపోగలమా?..మగవాడు అయినప్పటికీ లేడీ అఘోరీ గా మారి, మాయ మాటలు చెప్పి, అమాయకులను మోసం చేసి కోట్ల రూపాయిల సంపాదన అతి తక్కువ సమయం లోనే సంపాదించాడు. అంతే కాదు, ఇతను ఆడవాళ్లను లొంగదీసుకోవడం లో కూడా నేర్పరి. శ్రీ వర్షిణి అనే అందమైన అమ్మాయిని మాయ మాటలు చెప్పి తన వెంట తిరిగేలా చేసాడు. రెండు నెలల పాటు ఆ అమ్మాయి అతనితో కలిసి ప్రయాణం చేసింది. కుటుంబ సభ్యులు వర్షిణి కోసం వెతకాని ప్రదేశం అంటూ లేదు. అంతలా మాయ చేసి తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఎట్టకేలకు అఘోరి శ్రీనివాస్ దుర్మార్గాలను గమనించిన పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. అయితే రెండు నెలల పాటు అతనితో కలిసి తిరిగి శ్రీ వర్షిణి అనే అమ్మాయి, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆమె మాట్లాడుతూ ‘రెండు నెలల పాటు నేను అతనితోనే ఉన్నాను. దేవాలయాలకు బాగా తిప్పేవాడు, అక్కడ ప్రసాదాలు తీసుకోవడం, పడుకోవాలని అనుకుంటే ఎక్కడైనా పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపేసి నిద్రపోవడం వంటివి చేసేవాడు. మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి, భక్తులు ఆయన కారు స్టిక్కరింగ్ ని చూసే వచ్చేవాళ్ళు. ఒక్కొక్కరు 500 , లేదా వెయ్యి రూపాయిలు ఇవ్వడం, కారు కి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం, ఫుడ్ తినిపించడం, ఖరీదైన బట్టలు పెట్టడం వంటివి చేసేవారు. అలా రోడ్డు మీద వెళ్తున్న సమయం లో అతనికి ఎవరో ఒకరు ఎంతో కొంత డబ్బులు ఇస్తూనే ఉండేవాళ్ళు. అలా రోజుకి అతను పాతిక నుండి 30 వేల రూపాయిలు సంపాదించేవాడు. పెట్రోల్ ఫ్రీనే, డబ్బు ఫ్రీనే, ఆహరం ఫ్రీనే, ఇంకేమి ఉంది చల్లగా AC పెట్టుకొని పాడుకోవడమే అతను చేసే పని’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంత జరుగుతుంటే మీకు అతన్ని ఎప్పుడు ప్రశ్నించాలని అనిపించలేదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, వర్షిణి సమాధానం చెప్తూ ‘ఆశ్రమాన్ని నిర్మించాలని అనేవాడు. నేను అతన్ని అప్పట్లో గుడ్డిగా నమ్మేసాను, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. అతనే లోకం అంటూ తిరిగాను కదా, అందుకే అన్నీ నమ్మేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది. మీ కుటుంబ సభ్యులు నిన్ను అతి కష్టం మీద వెతికి మూడు వారాల తర్వాత ఇంటికి తిరిగి తీసుకొచ్చారు కదా, అప్పుడు మళ్లీ మీరెందుకు పారిపోయారు అని యాంకర్ అడగ్గా ‘దాదాపుగా పారిపోయాను అనే అనుకోండి, కానీ మధ్యలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్లే నేను వెళ్లాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.