Kavitha Wishes To KTR: అన్నీ బాగుంటే.. అనుకున్నట్టు జరిగితే ఈ సమయం వరకు కేటీఆర్ ఇంట్లో కల్వకుంట్ల కవిత ఉండేవారు. అన్నయ్య తో దగ్గరుండి కేక్ కట్ చేయించేవారు. పుష్పగుచ్చం లేదా విలువైన కానుక ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేసేవారు. జాగృతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడున్నవి ఒకప్పటి రోజులు కాదు. ఒకప్పటి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పుడు లేదు.. లేఖల లీకులు.. దేవుడు చుట్టూ దయ్యాలు.. వంటి మాటలు ఆమె నోటి నుంచి వచ్చాయి. ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి.. ఇలా లెటర్లు రాయడం సరికాదు.. అంటూ హెచ్చరికలు ఆయన నోటి నుంచి జాలు వారాయి. ఇందులో ఎవరిని ఎవరు అనుకున్నారు.. ఎవర్ని ఉద్దేశించి విమర్శించారనేది ముంజేతి కంకణమే.
Also Read: ఫోన్ ట్యాపింగ్.. రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన జన్మదినం అంటే భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు పండుగ రోజు కాబట్టి.. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. సిరిసిల్ల నుంచి మొదలుపెడితే ఖమ్మం వరకు కేటీఆర్ అనుచరులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు కవిత మీదనే ఉంది. ఎందుకంటే కవితకు, తారక రామారావుకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. మనస్పర్ధలు చోటుచేసుకున్నాయని.. అందువల్లే దూరంగా ఉంటున్నారని.. కవిత కూడా పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ నియమితుడైతే గుర్తించబోనని ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యల ద్వారా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. రాజకీయంగా ఇద్దరి మధ్య క్లాసెస్ కూడా ఉన్నాయని కవిత నేరుగా ఒప్పుకోవడం చర్చకు కారణమైంది. దీంతో కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం రోజున కవిత ఎలా స్పందిస్తారనేది అందరిలోనూ ఉత్కంఠ కలిగించింది. ఆ ఉత్కంఠకు కవిత తెరదించారు.
Also Read: రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ అవుతోందా.. అదీ రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడా..
కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ట్విట్టర్లో ఆయనకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్య హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ ట్విట్ చేశారు. వాస్తవానికి గతంలో తారకరామారావు జన్మదిన సందర్భంగా కవిత ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసేవారు. ఇప్పుడు రాజకీయంగా విరుద్ధమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో కవిత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పుడు కేటీఆర్ కు కవిత సంఘీభావం తెలియజేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం కేటీఆర్ చేస్తే.. రేవంత్ ప్రభుత్వం ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతోందని మండిపడ్డారు.. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి రాజకీయంగా పెను దుమారాన్ని రేపినప్పటికీ.. కవిత తన స్టాండ్ నుంచి తప్పుకోలేదు. భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు అయినప్పటికీ.. ఆమె జాగృతి రాష్ట్ర నాయకురాలి గానే వివిధ కార్యకలాపాలు చేపడుతున్నారు. దాశరధి కృష్ణమాచార్య జయంతిని కూడా జాగృతి ఆధ్వర్యంలోనే ఆమె నిర్వహించారు.
Annayya
Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025