KTR Revanth Reddy Wishes: రాజకీయాలు అనేది ఒక పరిధి వరకే పరిమితం కావాలి. విమర్శలు, ప్రతి విమర్శల వరకే అవి ఆగిపోవాలి. అంతే తప్ప రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. దురదృష్టవశాత్తు నేటి కాలంలో నాయకులు రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఇష్టానుసారంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇవి ఒక పరిధి వరకు ఆగిపోతే బాగుండేది. కానీ కుటుంబ విషయాలను కూడా రాజకీయాల పరిధిలోకి తీసుకురావడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. కింది స్థాయి కార్యకర్తలలో ఆగ్రహాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. పై నాయకులు బాగానే ఉంటున్నప్పటికీ.. కింది స్థాయిలోనే వైషమ్యాలు పెరిగిపోతున్నాయి.
Also Read: నేడు కేటీఆర్ బర్త్ డే.. కవిత రెస్పాన్స్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి. మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేది. కానీ గడిచిన కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు కూడా దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా నేతల మధ్య వ్యక్తిగత కక్షలు పెరిగిపోతున్నాయి. చివరికి కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల పరిధిలోకి తీసుకురావడంతో.. పాలిటిక్స్ అంటేనే ఏవగింపు కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే పరిస్థితి బాగోలేదు. బాగు చేసిన బాగుపడే స్థితిలో లేదు.. తెలంగాణ రాజకీయాలలో రేవంత్, కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేవారు. కేటీఆర్ చేపట్టిన విధానాలను ప్రశ్నించేవారు. అంతేకాదు అప్పట్లో కేటీఆర్ ఫామ్హౌస్ మీద డ్రోన్ ఎగరవేసిన కేసులో రేవంత్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు.. ఇవన్నీ కూడా రేవంత్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలకు కారణమయ్యాయి. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడానికి దోహదపడ్డాయి. సమయం దొరికితే చాలు రేవంత్ ఊరుకోడు. కేటీఆర్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోతాడు. ఇక వీరిద్దరూ చేసుకొని విమర్శలు కింది స్థాయి కార్యకర్తలలో ఆగ్రహాలు పెరగడానికి కారణం అవుతుంటాయి.
Also Read: ఫోన్ ట్యాపింగ్.. రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్
ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. రేవంత్ ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. గురువారం జన్మదినం జరుపుకుంటున్న కేటీఆర్ కు రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని.. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు రేవంత్ తన సందేశంలో వెల్లడించారు.. రేవంత్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకులు కూడా ముఖ్యమంత్రి దారిని అనుసరిస్తున్నారు. కేటీఆర్ కు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. రేవంత్ శుభాకాంక్షలు తెలియజేసిన నేపథ్యంలో ఆయన పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రత్యర్థి అయినప్పటికీ పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియజేశారని.. ఆయన క్షేమాన్ని కోరుకున్నారని.. ఇంతకంటే గొప్ప వ్యక్తిత్వం ఏముంటుందని నెటిజన్లు అంటున్నారు. గతంలో కెసిఆర్ ప్రమాదానికి గురైతే.. ఆసుపత్రికి వెళ్లి రేవంత్ పరామర్శించిన సంఘటనను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/Bu7MCvtg7S
— Telangana CMO (@TelanganaCMO) July 24, 2025