Konda Surekha Audio Leak: టాలీవుడ్ జంట విడాకుల వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ.. అప్పటినుంచి ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఆమె అనుచరుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు . ఓ వ్యక్తిని ఆయన బెదిరించగా.. దానికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
Also Read: కాలేశ్వరం కేసు.. కేసీఆర్, హరీష్ రావు కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు!
కొండ సురేఖకు నవీన్ రాజ్ అనే వ్యక్తి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అతడికి ప్రభుత్వం భద్రత కూడా కల్పిస్తోంది. ఇద్దరు అంగరక్షకులను కేటాయించినట్లు సమాచారం. అయితే ఇటీవల లారీ ఓనర్స్, ఇసుక కాంట్రాక్టర్ల మధ్య వివాదం ఏర్పడింది. అది కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారిపోయింది. ఇందులోకి నవీన్ ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కాంట్రాక్టర్లు.. అలాంటి పని తాము చేయడం లేదని లారీ ఓనర్లు.. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. దీంతో కొద్దిరోజులుగా లారీలో లోడ్ అయిన ఇసుక డంప్ కావడానికి రోజుల సమయం పడుతుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కొందరు గులాబీ పార్టీకి అనుకూలంగా.. మరికొందరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు.
Also Read: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారా?
అయితే ఈ వ్యవహారంలోకి కొండా సురేఖ ముఖ్య అనుచరుడు నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. పంచాయతీని సెటిల్ చేస్తాను అని చెప్పి బూతులపర్వం మొదలుపెట్టాడు. లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ బండబూతులు తిట్టాడు. రాయడానికి వీలు లేని భాషలో మాట్లాడాడు. అంతేకాదు మంగళవారం విధుల్లో ఉన్న హన్మకొండ సిఐ ని కూడా దూషించాడు. ఈ వ్యవహారం రాజకీయంగా వివాదానికి కారణం కావడంతో నవీన్ కు ప్రభుత్వం కేటాయించిన అంగరక్షకులను వెనక్కి తీసుకుంది. అంతేకాదు నవీన్ ఇటీవల కాలంలో భూకబ్జాలు, ఇతర వ్యవహారాలలో తల దూర్చుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అతని పట్ల అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఫిరోజ్ అలీ తో నవీన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో కొండా సురేఖ మరోసారి తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారారు. మరి దీనిపై కొండా సురేఖ ఎటువంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.
మంత్రి కొండా సురేఖ ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ ఆడియో కాల్ లీక్
లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ఫిరోజ్ అలీకి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసి, బూతులు తిట్టిన నవీన్ రాజ్
మంగళవారం విధుల్లో ఉన్న
హన్మకొండ సీఐపై దురుసుగా ప్రవర్తించిన నవీన్ రాజ్దీంతో నవీన్ రాజ్‌కు ఉన్న 1+1… pic.twitter.com/PKnk5IXWOG
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2025