Bigg Boss 9 Telugu Emmanuel captain: ఈ వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్కులు ఆడియన్స్ ని అంతగా అలరించడం లేదు. బిగ్ బాస్ షోని అమితంగా ఇష్టపడే వాళ్లకు కూడా ఈ వారం జరిగే ఎపిసోడ్స్ ని నిరాకరిస్తున్నారు. టీఆర్ఫీ రేటింగ్స్ పడిపోతున్న విషయాన్నీ గమనించిన బిగ్ బాస్ టీం అమర్ దీప్ మరియు అర్జున్ లను హౌస్ లోపలకు పోలీస్ ఆఫీసర్స్ గా పంపించారు. వీళ్ళ ద్వారా కాస్త ఎంటర్టైన్మెంట్ ని అందించే ప్రయత్నం చేశారు కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. ఎన్నో ఈవెంట్స్ లో అర్జున్, అమర్ దీప్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ ని మనమంతా చూసాము. వీళ్ళ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ కూడా నవ్వులు పూయించలేకపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ వారం డిజైన్ చేసిన టాస్క్ కాన్సెప్ట్ ఎంత చెత్తగా ఉంది అనేది.
అయితే నేటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో చివరి రౌండ్ పూర్తి అవ్వబోతుంది అనేది మనకి రెండవ ప్రోమో ని చూస్తేనే తెలుస్తోంది. క్యాప్ టాస్క్ లో ఇమ్మానుయేల్, భరణి,రీతూ చౌదరి, దివ్య నిఖిత, పవన్ కళ్యాణ్, తనూజ,నిఖిల్ వంటి వారు పాల్గొంటారు. ఈ టాస్క్ లో ఇమ్మానుయేల్ అద్భుతంగా ఆడుతాడు. బజర్ మ్రోగిన ప్రతీసారీ ఇమ్మానుయేల్ నే ముందుగా క్యాప్ ని పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్, నిఖిల్ వంటి బలమైన కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళని దాటుకొని ఇమ్మానుయేల్ నెగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ క్యాప్ పట్టుకున్న ప్రతీసారీ ఇమ్మానుయేల్ దానిని సంజన కి ఇస్తూ వచ్చాడు. ఆమె కెప్టెన్ అవ్వడానికి ఇష్టం లేని వాళ్ళని తొలగిస్తూ వచ్చింది. అలా అందరినీ తొలగించగా చివరికి తనూజ, ఇమ్మానుయేల్ నిలుస్తారు. వీరిద్దరిలో ఇమ్మానుయేల్ చాలా తేలికగా క్యాప్ ని ముందుగా అందుకొని, ఇంటికి రెండవసారి కెప్టెన్ అవుతాడు.
మొదటిసారి కెప్టెన్ అయ్యినప్పుడు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన సంజన కోసం చాలా తేలికగా తన కెప్టెన్సీ ని త్యాగం చేసాడు ఇమ్మానుయేల్. అప్పుడు డిమోన్ గెలిచి కెప్టెన్ అవుతాడు. పాపం ఇమ్మానుయేల్, కస్టపడి గేమ్ ఆడాడు, తన అమ్మ సంజన కోసం కెప్టెన్సీ ని త్యాగం చేసాడు అని అందరూ బాధపడ్డారు. ఇప్పుడు ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చినందుకు ఇమ్మానుయేల్ ని అభిమానించే వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేటి వరకు ఇమ్మానుయేల్ టాస్కులు వచ్చినప్పుడు తన వైపు నుండి నూటికి నూరు శాతం ఇస్తూ వచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కెప్టెన్ అయ్యాక ఇమ్మానుయేల్ హౌస్ ని ఎలా మైంటైన్ చేస్తాడు అనేది చూడాలి. ఒకవేళ తన అమ్మ సంజన కి ఒక న్యాయం, మిగిలిన కంటెస్టెంట్స్ కి మరో న్యాయం అనే విధంగా ఉంటే మాత్రం బోలెడంత నెగిటివిటీ ని ఎదురుకోవాల్సి వస్తుంది.