Konda Murali: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు అంతకంతకు వేడిగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేస్తున్న వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇటీవల ఆయన కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని.. రాజకీయంగా తమను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మురళి వ్యాఖ్యానించారు.. తాను తలుచుకుంటే ఏదైనా చేయగలనని సవాల్ విసిరారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మురళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాంధీభవన్ పిలిపించింది. క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆయన వాదన వినిపించాల్సి వచ్చింది. ఆ తర్వాత మురళి అదే స్థాయిలో మాట్లాడారు. రాజకీయంగా తమను తొక్కడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని.. అటువంటివి సాధ్యం కాదని.. కొండా మురళితో మామూలుగా ఉండదని ఆయన హెచ్చరించారు. తాను ఏదైనా చేయగలనని.. ఎన్నో చేసి ఇక్కడదాకా వచ్చానని.. ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనని మురళి వ్యాఖ్యానించారు.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైనప్పటికీ.. మురళి తన ధోరణి మార్చుకోలేదు. అంతకుమించి అనే రేంజ్ లోనే ఆయన కామెంట్స్ చేశారు. మళ్లీ ఇప్పుడు మురళి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలలో సైతం హీట్ పుట్టిస్తున్నాయి.
తాజాగా వరంగల్లో జరిగిన ఓ మీటింగ్లో కొండా మురళి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఇటీవలి ఎన్నికల్లో 16 ఎకరాల భూమి అమ్మి ఖర్చు పెట్టానన్నారు. 16ఎకరాల భూమి అమ్మితే 70 కోట్ల దాకా వచ్చిందని.. ఆ 70 కోట్లను తాను ఎన్నికల్లో ఖర్చు పెట్టానని అన్నారు. తన వద్ద ఇంకా 500 ఎకరాల భూమి ఉందని.. తనకు ఎవరి డబ్బులూ అవసరం లేదని మురళి వ్యాఖ్యానించారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మురళి హెచ్చరించారు. తనను అనవసరంగా గెలకొద్దని.. గెలికితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని మురళి పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనూ కొండా మురళి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తన భార్య సురేఖకు ఆదాయం రాని పోస్టులు ఇచ్చారని.. వాటి వల్ల పెద్దగా ఇన్కమ్ ఉండదని పేర్కొన్నారు. ఆమెకే ప్రతినెల ఖర్చులకోసం తాను ఐదు లక్షల దాకా పంపిస్తున్నట్టు మురళి వెల్లడించారు. “దేవాదాయ శాఖలో దేవుడు మాత్రమే ఉంటాడు. అందులో రూపాయి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. ఇక పర్యావరణంలో చెట్లు, గుట్టలు తప్ప ఏమీ ఉండవు.. అలాంటప్పుడు ఆదాయం ఎలా వస్తుంది? వెనకేసుకోవడానికి ఏముంటుందని” మురళి పేర్కొన్నారు. ఆ సంఘటన మర్చిపోకముందే మరో మారు హాట్ కామెంట్స్ చేసి.. మురళి వార్తల్లో నిలిచారు.
మొన్న ఎన్నికల్లో 16 ఎకరాలు అమ్మి రూ.70 కోట్లు ఖర్చు పెట్టిన
నాకు ఇంకా 500 ఎకరాల భూమి ఉంది.
మీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా నాకు వద్దు.
– కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి pic.twitter.com/OuVatBFbCq— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2025