Coolie Movie: ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరస సక్సెస్ లను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో లోకేష్ కనకరాజు ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ (Rajinikanth)…ఆయన చేసిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా డబ్ అయి తెలుగు ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… నిజానికి ఆయన నుంచి ఒక సినిమా వస్తే తమిళంతో పాటు తెలుగులో కూడా అతని సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే దక్కుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ తెలుగులో ఇప్పుడు సంపాదించుకున్నవే కావడం విశేషం. 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీపడి మరి సినిమాలను చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్షన్లో చేస్తున్న కూలీ (Cooli) సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున లాంటి నటులు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళతో పాటుగా మరొక స్టార్ హీరో కూడా ఇందులో భాగమవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట. లోకేష్ కనకరాజుకి రామ్ చరణ్ కి మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ వల్లే తను ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా ఫిలింనగర్ సర్కిల్లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. లోకేహ కనకరాజు తన తదుపరి చేయబోయే సినిమాల లిస్ట్ లో రామ్ చరణ్ సినిమా కూడా ఉంది.
అలాగే వీళ్లిద్దరి మధ్య ఉన్న మంచి బాండింగ్ వల్లే రామ్ చరణ్ ను ఆ సినిమాలో నటింపజేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఈ సినిమా కోసం రామ్ చరణ్ రెండు రోజులు తన డేట్స్ ని కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది.
తెలుగు, తమిళ్ తో పాటు పాన్ ఇండియాలో పలు రికార్డులను క్రియేట్ చేస్తుందా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి… లోకేష్ కనకరాజు ఇంతకుముందు విజయ్ తో చేసిన లియో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి మరోసారి తన మార్కెట్ ను భారీ స్థాయిలో విస్తరింపజేసుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది…