Chicken : ఫలితంగా ముక్కలేనిది ముద్ద దిగని పరిస్థితికి వచ్చారు. పైగా కొత్త కొత్త హోటళ్లు, రకరకాల మెనూలు అందుబాటులోకి రావడంతో చాలామంది బయటనే తినేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ లో రకరకాల ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ చేస్తే సరాసరి ఫుడ్ ఇంటికి వస్తోంది. అయితే ఇందులో వెజ్ కంటే నాన్ వెజ్ ఆర్డర్సే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఇటీవల కాలంలో మాంసాన్ని అమ్మే స్టార్టప్స్ అందుబాటులోకి రావడంతో.. వాటి విక్రయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ స్టార్టప్ సంస్థలు.. ఇకపై టైర్-1, టైర్ -2, టైర్ -3 సిటీలకు కూడా విస్తరించనున్నాయి. మాంసం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరంలో ఆదివారం వచ్చిందంటే చాలు ఇతర ప్రాంతాల నుంచి చికెన్, గొర్రెలు, చేపలు, రొయ్యలు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ప్రజల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది అక్రమార్గాలు పడుతున్నారు. దీంతో జనం రోగాల బారిన పడుతున్నారు.
కోడి మాంసం అంటూ విక్రయిస్తున్నారు
హైదరాబాదులో కోడి మాంసం దుకాణాలు లక్షలాదిగా ఉంటాయి. వీటిల్లో రోజు లక్షల క్వింటాలలో విక్రయాలు జరుగుతుంటాయి. అయితే మాంసం విక్రయించే దుకాణాలలో కోళ్లకు సంబంధించిన వ్యర్ధాలను బయటపడేస్తుంటారు. అయితే వాటిని కొంతమంది సేకరించి కోడి మాంసం పేరుతో విక్రయిస్తున్నారు. పాతబస్తీ కేంద్రంగా కుళ్ళిన కోడి మాంసాన్ని అక్రమార్కులు అమ్ముతున్నారు. ఇలా అమ్ముతున్న రెండు ముఠాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఆ ముఠాలు కూలిన కోడి మాంసాన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. అంతేకాదు ఆ ముఠాలు ఏకంగా కూలిన కోడి మాంసాన్ని నిల్వ చేయడానికి ఏకంగా గిడ్డంగులు నిర్మించాయి. వాటి ద్వారా నగరంలోని రెస్టారెంట్లు, బార్లు, పబ్ లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్నారు..
దాన్ని అదునుగా చేసుకొని..
కొంతమంది కోడి మాంసాన్ని స్కిన్ తో తింటారు. కొంతమంది స్కిన్ లేకుండా తింటారు. ఇక ఉదర భాగం ముక్కలు, రెక్కలు, తొడ మాంసాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు.. ఇక ఆన్లైన్ సంస్థలు కూడా మేక, గొర్రెపోతు, కోడి మాంసాన్ని విక్రయిస్తున్నాయి.. అయితే వీటి పరిధిలో మాంసాన్ని శుద్ధి చేసే సమయంలో వ్యర్ధాలు భారీగా పోగవుతున్నాయి. ఆ వ్యర్ధాలను ఈ ముఠా సభ్యులు సేకరించి.. గోదాములలో భద్రపరిచి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న సంచుల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు.. బేగంపేటలోని ఓ ప్రాంతంలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కు చెందిన గోదాం నుంచి బయటికి సరఫరా అవుతున్న కోడి మాంసం పై అనేక ఆరోపణలు ఉన్నాయి. గోదాం పై అధికారులు తనిఖీలు చేయగా.. విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మాంసం మొత్తం పూర్తిగా వ్యర్థాలతో రూపొందించిందని.. పైగా అది రోజుల తరబడి నిల్వ ఉన్నదని.. హై ఎండ్ ఫ్రీజర్వేటర్లు వాడి ఆ మాంసాన్ని ప్యాక్ చేస్తున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో అధికారులు వెంటనే ఆ కేంద్రాన్ని మూసివేశారు. ఇక బేగంపేట ప్రకాష్ నగర్ లోనూ ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక గోదాం పై అధికారులు దాడులు చేసి దాదాపు 700 కిలోల కుళ్లిపోయిన కోడి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కంటోన్మెంట్ లోనూ ఇలాంటి కేంద్రమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దానిని అధికారులు మూసివేశారు.