Khamenei X Account : పశ్చిమాసియాలో యుద్ధం క్రమంగా తీవ్రమవుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. మొన్నటి వరకు హమాస్, హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిసిస్తోంది. ఆయుధ కేంద్రాలు లక్ష్యంగా ఈ దాడులను కొనసాగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ కూడా ఇరాన్ సుప్రీం ఖమేనీకి షాక్ ఇచ్చింది. ఈమేరకు అతని హిబ్రూ భాష ఎక్స్ ఖాతాను సస్పెండ్ చేసింది. ఖమేనీ తరచూ ఇజ్రాయెల్ వ్యతిరేక పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఎక్స్ యాజమాన్యం అతని ఖతాను సస్పెండ్ చేసింది. జెరూసలేం పోస్ట్ ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ తెరిచిన హిబ్రూ భాష ఖాతా కేవలం రెండు పోస్ట్‌ల తర్వాత తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆదివారం చేసిన పోస్టు ఇలా ఉంది. ‘జియోనిస్ట్ పాలన తప్పు చేసింది. ఇరాన్‌కు సంబంధించి దాని గణనను తప్పుపట్టింది. ఇరాన్ దేశం యొక్క శక్తి, సామర్థ్యం, చొరవ మరియు కోరిక ఏమిటో మేము అర్థం చేసుకుంటాము.’ ఇక మొదటి హీబ్రూ భాష పోస్ట్ శనివారం వచ్చింది, ‘దయగల అల్లాహ్ పేరులో‘ అని చదవబడింది. గత వారం ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత ఈ రెండు పోస్ట్‌లు వచ్చాయి.
దాడిని తక్కువ చేసి చూపొద్దు..
ఇదిలా ఉంటే.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ఖమేని స్పందించారు. దాడులను పెద్దదిగా చేయరాదని లేదా తక్కువ చేసి చూపవద్దని ఖమేనీ అన్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన చర్యల ప్రభావాలను విస్తరించాలని కోరుకుంటుండగా, ఇరాన్ దాడులను చాలా తక్కువ అని కొట్టిపారేయడం కూడా సరైనది కాదని ఖమేనీ అన్నారు, ‘వారు ఇరాన్‌కు సంబంధించి తప్పుడు లెక్కలు వేస్తున్నారు‘ అని అతను తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన వ్యాఖ్యలలో చెప్పాడు. ‘ఇరానియన్ ప్రజల శక్తి, సామర్థ్యం, చాతుర్యం మరియు దృఢ సంకల్పాన్ని వారు ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. మనం ఈ విషయాలను వారికి అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ దాడి తర్వాత..
క్షిపిణి తయారీ కేంద్రాలు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిఫిణి శ్రేణులు, ఇతర వైమానిక సామర్థ్యాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. వీటిపై ఏకకాలంలో దాడిచేసింది. ఇజ్రాయెల్ తన సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడులు శనివారం ఇద్దరు సైనికులను చంపాయని ఇరాన్ తెలిపింది.
ఇరాన్ దాడి..
ఇదిలాఉంటే అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్‌పై వైమానికి దాడి చేసింది. హె జ్‌బొల్లా చీఫ్ హత్యను వ్యతిరేకిస్తూ ఈ దాడి చేసింది. సుమారు వంద క్షిపిణులు ప్రయోగించింది. వీటిలో చాలా వరకు ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసింది. మరోవైపు దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేస్తోంది. తమ విమానాలు దాడిచేసి తిరిగి క్షేమంగా వచ్చాయని యని, తమ మిషన్ నెరవేరిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ వైమానిక దళం టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్సులలోని సైనిక స్థావరాలపై ‘పరిమిత నష్టం కలిగించింది‘ అని ధ్రువీకరించింది.