KCR vs Revanth Reddy: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ రెండు రోజుల కార్యక్రమాల కోసం తెలంగాణలో డిసెంబర్ 13, 14వ తేదీల్లో పర్యటించారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఇండియా కూటమి కొనసాగుతుందని ప్రకటించారు. తర్వాత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి చర్చించారు. ఈ సమావేశాల సన్నివేశాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ రాజసం.. అఖిలేష్ అసౌకర్యం
రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో ఫొటోలు ఆకట్టుకున్నాయి. సీఎం రాజమహాల సింహాసనంలా గొప్ప కుర్చీలో కాలు మీద కాలు పెట్టుకుని కూర్చున్నారు. కానీ అఖిలేష్ యాదవ్‌కు అసౌకర్యకరమైన తక్కువ సోఫా కేటాయించారు. ఆయన మోకాళ్లు బయటకు పెట్టుకుని ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ పరిస్థితి కూడా ఇలాంటిదే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో కేసీఆర్‌ను దొర అని..
బీఆర్‌ఎస్ పాలన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌ను నాడు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి దొరగా సంబోధించారు. ప్రగతి భవన్‌ను గడీగా మార్చారని ఆరోపించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆయన అదే శైలిని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌తో గత భేటీల ఫొటోలు, రేవంత్‌తో ప్రస్తుత చిత్రాలు పోల్చి చూస్తూ సోషల్ మీడియా వాడుకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఎవరు దొర??? pic.twitter.com/Lf8wjZEkpE
— (@Nallabalu1) December 14, 2025