who introduced Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తన కంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్… ఆయన చేసిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయి తెలుగు ప్రేక్షకులను సైతం విశేషంగా అలరిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్న ఆయన ఇప్పటికి బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించడంలో ముందుకు దూసుకెళ్తున్నాడు… ప్రస్తుతం ‘జైలర్ 2’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఇక రీసెంట్ గా రజనీకాంత్ చేసిన ‘కూలీ’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు.
ఇక ఇప్పటికైనా ‘జైలర్ 2’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి తన అభిమానులకు గొప్ప విజయాన్ని కట్టబెడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ ను స్టార్ డైరెక్టర్ హీరోగా చేసిన వాళ్లలో ‘కె ఎస్ రవికుమార్’ మొదటి స్థానంలో ఉంటాడు. బాల చందర్ రజనీకాంత్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికి, తనకి కమర్షియల్ సక్సెస్ లను అందించింది మాత్రం కేఎస్ రవికుమార్ కావడం విశేషం…
ముత్తు, నరసింహ తన కెరీర్ కి మైలురాళ్లుగా మిగిలిపోయాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అయ్యేది. రజనీకాంత్ కి ఆ స్వాగ్ ను బయటికి తీసింది కూడా కేఎస్ రవికుమార్ కావడం విశేషం… రజినీ కాంత్ కి కె ఎస్ రవికుమార్ కి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇప్పటికీ కేఎస్ రవికుమార్ తను ఏ సినిమా చేసిన కూడా ఆ కథని మొదట రజనీకాంత్ కి వినిపిస్తారట… ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లతో రజనీకాంత్ సినిమాలను చేస్తున్నాడు కాబట్టి మరోసారి రవికుమార్ కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం రావడం లేదు. ఇక కె ఎస్ రవికుమార్ సైతం ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక ఆయన డైరెక్షన్ కి కొంతవరకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది…