KCR: వినేవాడు వెర్రోడు అయితే.. చెప్పేవాడు చంద్రశేఖర్‌రావు!

మాటలతో మాయ చేయడంలో తెలంగాణలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. గారడి వాడు కూడా ఒక్కోసారి తడబడతాడు.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 12:06 pm

KCR

Follow us on

KCR: వినేవాడు.. చెప్పేవాడికి ఎప్పుడూ లోకువే. ఎవరూ అడ్డు చెప్పనంతం వరకు తానే తెలివైడినోడినని భావిస్తాడు. కానీ, ఎప్పుడైతే ఎదుటి వాడి నుంచి ప్రశ్న వస్తుందో.. అప్పుడే చెప్పేవాడు సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడతారు. పదేళ్లు తెలంగాణను ఏలిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాచరిక పాలనను తలపించారు. తాను రాజునని, తన కొడుకు యువరాజు, కూతురు యువరాని అన్నట్లు వ్యవహరించారు. ఇక తెలంగాణ జనం తాను ఏది చెబితే అదే నమ్ముతారని భావించాడు. కానీ ఇది ప్రజాస్వామ్యం. అవకాశం, అధికారం ఎప్పుడూ ఒకరివైపే ఉండవు. ఈ విషయం 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవితకు బోధపడింది. కేసీఆర్‌ భాషలో చెప్పాలంటే.. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఈడ్చి బండకేసి కొట్టారు. అధికారం నుంచి కూలదోశారు.

మళ్లీ అవే గారడి మాటలు..
మాటలతో మాయ చేయడంలో తెలంగాణలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. గారడి వాడు కూడా ఒక్కోసారి తడబడతాడు. అలాగే 2023 ఎన్నికల సమయంలో కేసీఆర్‌ చెబుతున్నవన్నీ గారడి మాటలే అని తెలంగాణ సమాజం గుర్తించింది. గద్దె దించింది. ఓటమి తర్వాత కొన్నాళ్లూ సైలెంట్‌ అయిన కేసీఆర్‌ ఇప్పుడు మళ్లీ అవే గారడి మాటలు మొదలు పెట్టారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్‌ అయి నెల రోజులైనా స్పందించలేదు. కనీసం ఖండించలేదు. ఎట్టకేలకు కూతురు అరెస్టు గురించి మాట్లాడారు. తాము బీఎల్‌.సంతోష్‌ను అరెస్టు చేయడానికి యత్నించడంతోనే ప్రధాని మోదీ తమపై కక్ష కట్టాడని ఆరోపించారు. అందుకే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేయించాడని పేర్కొన్నారు. ఇక బీఆర్‌ఎస్‌కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే సర్కార్‌ను కూల్చడానికి బీజేపీ యత్నించిందని, ఇప్పుడు 65 మంది ఉన్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టడని తెలిపారు. రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లకపోవచ్చుకానీ, ఎమ్మెల్యేల్లో చీలికకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

టచ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలట..
ఇక మరో గారడీ ముచ్చట ఏంటంటే.. కేసీఆర్‌తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారట. అదీ ఒకరిద్దరు కాదు ఏకంగా 20 మంది అని చెబుతున్నారు. మెడకాయమీద తలకాయ ఉన్నోడు ఎవడైనా ఇప్పుడు బీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి వెళతాడా. అందుకే వినేవాడు ఎర్రోడు అయితే.. చెప్పేవాడు కేసీఆర్‌ అవతాడు. బీఆర్‌ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి 20 మంది వెళ్లినా 59 మందే అవుతారు. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. కానీ, తన గారడీ మాటలతో మరోమారు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీని టచ్‌ చేసిందే కేసీఆర్‌..
అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని గిల్లి మరీ టచ్‌ చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్‌. ఒసారి ప్రెస్‌మీట్‌లో అయితే మోదీకే వార్నింగ్‌ ఇచ్చారు. నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతా అని తెలిపారు. అన్నట్లుగానే ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు యత్నించిందని ఓ దిక్కుమాలిన డ్రామాకు తెరలేపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిందని లబోదిబో మని మొత్తుకున్నారు. తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీనీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను బద్నాం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో కుట్ర వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఎల్‌.సంతోష్‌ను అరెస్టు చేసే ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.

కవిత తనకు తానే ఇరుక్కుంది..
కేసీఆర్‌ బీఎల్‌. సంతోష్‌ను ఇరికించాలని ప్రయత్నించారు. కానీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత తానంతట తానే ఇరుక్కుంది. ఇక బీజేపీ బీఆర్‌ఎస్‌ను కూల్చడానికి కుట్ర చేసిందన్న మాటలను ఎవరూ నమ్మలేదు. ఎన్నికలకు ఏడాది ముందు ప్రభుత్వాన్ని ఎవరు కూలుస్తారు. అదీ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూతులుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను బెదిరించడానికి కేసీఆర్‌ చేసిన ప్రయత్నమే అని ప్రజలు నమ్మారు. ఇక ఇప్పడు కేసీఆర్‌ తన కూతురు లిక్కర్‌ దందా చేసిందా లేదా అనేది చెప్పడం లేదు. ఇటు కేటీఆర్‌ కూడా ఆ విషయం చెప్పకుండా కేసులో ఇరికించారు అని ఆరోపిస్తున్నారు. దందాతో సంబంధం లేదని మాత్రం ఎవరూ చెప్పడంలేదు.