KCR: రేవంత్ కోరుకున్నది అదే.. కేసీఆర్ చేసిందీ అది.. రంజుగా తెలంగాణ రాజకీయాలు

రోగి తినాలనుకున్నది పెరుగున్నమే.. డాక్టర్ తినాలని చెప్పిందీ పెరుగన్నమే.. ఓ ఫ్రెంచ్ సామెతకు తెలుగు అనువాదం ఇది. ఈ సామెతకు తగ్గట్టుగానే సాగుతున్నాయి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు..

Written By: Anabothula Bhaskar, Updated On : November 10, 2024 11:14 am

KCR

Follow us on

KCR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం తర్వాత భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ బయటికి వచ్చిన ఉదంతాలు చాలా తక్కువ. కవిత జైలు నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా ఆయన ఆమె కోసం విమానాశ్రయానికి రాలేదు. ఢిల్లీకి వెళ్లలేదు. కనీసం జైలులో ఆమెను పరామర్శించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా కేసీఆర్ బయటికి వచ్చారు.. ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చినప్పటికీ.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడినప్పటికీ.. ఆ తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు. అయితే తొలిసారిగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఆ సమయంలో ఆయన వెంట ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నారు. అయితే తొలిసారిగా కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు..” తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడు తెలుసుకుంటున్నారు. జరుగుతున్న విశాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. భారత రాష్ట్రపతి నాయకులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలకు భారత రాష్ట్ర సమితి పై విశ్వాసం ఉంది. రాష్ట్రంలో మరోసారి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఒట్టి మాటలతో పరిపాలన సాగదు. అధికారంలోకి రాగానే వాన్ని జైల్లో వేయాలనే విధానాన్ని భారత రాష్ట్ర సమితి పాటించదు. అందర్నీ కాపాడేది ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు ఎలా మాట్లాడుతున్నారో తెలుస్తూనే ఉంది. ప్రజల మొత్తం గమనిస్తూనే ఉన్నారని” కెసిఆర్ వ్యాఖ్యానించారు.

చాలా రోజుల తర్వాత..

చాలా రోజుల తర్వాత గులాబీ అధినేత కేసిఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడటం సంచలనగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పూర్తిగా ఫలితాలు వెలువడక ముందే ట్రెండ్స్ చూసి ఆయన ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. అనంతరం ఆయన ఇంట్లో పడిపోయారు.. యశోద ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. చాలా రోజులు విశ్రాంతి తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నిక సమయంలో బయటికి వచ్చారు. ఆ సమయంలో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఆయన పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. అనంతరం మళ్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్కసారి వచ్చారు. ఇక నాటి నుంచి ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు. వ్యవసాయ క్షేత్రంలో మాత్రమే ఉంటున్నారు. పార్టీ ముఖ్య నాయకులు వచ్చినప్పుడు కలుస్తున్నారు. అప్పుడప్పుడు సూచనలు చేస్తున్నారు. సుమారు 5 నెలల విరమణ తర్వాత కేసీఆర్ నోరు విప్పడం.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడటం సంచలనంగా మారింది. అయితే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ను రేవంత్ లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కెసిఆర్ నేరుగా స్పందించడం.. రేవంత్ రెడ్డి పరిపాలనలో లోపాలు బయటపెట్టి విమర్శించడం.. ఒక్కసారిగా సంచలనంగా మారింది. “రేవంత్ కోరుకుంటున్నది ఇదే. ఇప్పుడు కెసిఆర్ పంపించారు కాబట్టి తెలంగాణ రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయి. ఇకపై విమర్శలు – ప్రతి విమర్శలు కొనసాగితే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని” రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇన్నాళ్లపాటు కేసీఆర్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోరుకున్నట్టుగానే కెసిఆర్ బయటకు రావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడిగా మారాయి.