Partition Of Bengal: బెంగాల్‌ విభజన తప్పదా.. ఇప్పటికే రెండుసార్లు విభజన.. మళ్లీ తెరపైకి.. అసలేంటి వివాదం

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1947లో భారత్, పాకిస్తాన్‌ విడిపోయాయి. దేశ విభజన సమయంలో బెంగాల్‌ రెండోసారి విభజన జరిగింది. ఇప్పుడు మూడోసారి విభజన అంశం తెరపైకి వచ్చింది.

Written By: Raj Shekar, Updated On : July 25, 2024 4:27 pm

Partition Of Bengal

Follow us on

Partition Of Bengal: స్వాతంత్య్రానికి 1095, అక్టోబర్‌ 16 నాటికి బెంగాల్‌ పిస్టన్‌ బెంగాల్, అస్సాం (31 మిలియన్ల జనాభాతో), మిగిలిన బెంగాల్‌ (4 మిలియన్ల జనాభాతో 18 మిలియన్ల జనాభాతో) విభజించబడింది. జనాభాలో బెంగాలీలు(36 మిలియన్ల బీహారీలు,ఒరియాలు). నాటి బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్‌ కర్ణన్‌ బెంగాల్‌ చాలా పెద్దగా ఉందని, దానిని సమర్థవంతంగా పరిపాలించలేమని ఈ నిర్ణియం తీసుకున్నారు. విభజన ఎక్కువగా ముస్లింలు ఉన్న తూర్పు ప్రాంతాలను ఎక్కువగా హిందూ పశ్చిమ ప్రాంతాల నుండి వేరు చేసింది. ప్రావిన్షియల్‌ రాష్ట్రం బెంగాల్‌ ఆ సమయంలో దాదాపు 80 మిలియన్ల జనాభాను కలిగి ఉంది . ఇందులో బీహార్‌లోని హిందీ మాట్లాడే ప్రాంతాలు, ఒడిశాలోని ఒడియా మాట్లాడే ప్రాంతాలు, అస్సాంలోని అస్సామీ మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. 1904 జనవరిలో ప్రభుత్వం విభజన ఆలోచనను ప్రకటించింది. ఈ ఆలోచనను అస్సాం చీఫ్‌ కమిషనర్‌ హెన్రీ జాన్‌ స్టెడ్‌మన్‌ కాటన్‌ వ్యతిరేకించారు. కానీ బెంగాల్‌ విభజన అక్టోబర్‌ 16, 1905న వైస్రాయ్‌ కర్జన్‌ ద్వారా జరిగింది. ఇక రెండోసారి దేశ విభజన సమయంలోనూ రాష్ట్ర విభజన జరిగింది. బెంగాల్‌లోని కొంత భాగం పాకిస్తాన్‌లో కలిసింది. అయితే తర్వాత 1970 వారంతా పోరాటం చేసి బంగ్లాదేశ్‌గా స్వాతంత్య్రం పొందారు. స్వాతంత్య్రం సమయంలో లూయిస్‌ మౌంట్‌ బాటన్, పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, మొహమ్మద్‌ అలీ జిన్నాతో విభజన ప్రణాళిక గురించి చర్చించారు. ఈ క్రమంలో కేవలం మతం ప్రాతిపదికన విభజన చేశారు.

తాజాగా మళ్లీ విభజన?
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రెండు సార్లు జరిగిన బెంగాల్‌ను మూడోసారి కూడా విభజిస్తారన్న చర్చ జరగుతోంది. అయితే ఈసారి మతం ప్రాతిపదికన కాకుండా, భౌగోలిక పరిస్థితుల ఆధారంగా విభజించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విభజన ఆలోచన మరోమారు తెరపైకి వచ్చింది. అయితే బెంగాల్‌ను విభజిస్తే ఎలా విభజిస్తారు. అందుకు కారణాలు ఏమిటి అన్న చర్చ కూడా బెంగాల్‌లో విస్తృతంగా జరుగుతోంది. పాలనా సౌలభ్యం కోసం, సరిహద్దు వివాదాలు పరిష్కరించే అవకాశం విభజనతో కలుగుతుందని భావిస్తున్నారు.

విభజన ఇలా..
ఇక బెంగాల్‌ విభజన అంశం కొత్తది కాదు. అయితే గత రెండు విభజనలకు భిన్నంగా ఈసారి విభజన చేయాలని నార్త్, సౌత్‌ బెంగాళీలు కోరుతున్నారు. భౌగోళికంగా బెంగాల్‌ టీ తోటలు, సహజ వనరులు, ఖనిజాలు, కొండలు, విదేశాలతో నార్త్‌ బెంగాల్‌ సరిహద్దు కలిగి ఉంది. దేశ రక్షణకు ఇది కీలక ప్రాంతం .దీంతో తమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని సౌత్‌ బెంగాలీలు కోరుతున్నారు. బ్రిటిష్‌ పాలకులు కూడా నార్త్‌ బెంగాల్‌ను ప్రత్యేకంగా పాలించారు. వాస్తవానికి బెంగాల్‌ మొత్తం దక్షిణ బెంగాల్‌లోని కోలకత్తా కేంద్రంగానే అభివృద్ధి జరిగింది బెంగాల్‌లో పరిశ్రమలన్నీ కోల్‌కత్తా చుట్టూ వెలిశాయి. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, పరిపాలన తదితర అంశాల్లో దక్షిణ బెంగాల్‌లో మెరుగ్గా ఉన్నాయి. అందుకే నార్త్‌ బెంగాళీలు తమను వేరుగా గుర్తించాలని కోరుతున్నారు.

అంత ఈజీనా..
ఇదిలా ఉంటే.. బెంగాల్‌ విభజన అంత సులభంగా జరుగుతుందా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. దేశంలో ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాల పునర్విభజనలు జరిగాయి. చివరి రాష్ట్ర విభజన 2014లో జరిగింది. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అంతకుముందు జార్ఖండ్, ఛతీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంతకు ముందు గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే విభజన కోసం ఉద్యమాలు జరిగాయి. ప్రస్తుతం బెంగాల్‌ విభజన జరిగితే పలు రాష్ట్రాల్లో మళ్లీ విభజన ఉద్యమాలు జరుగుతాయి. మహారాష్ట్రలో విదర్భను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుతున్నారు. బెంగాల్‌ను విభజిస్తే మరో ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.