KCR Birthday: అతనొక ఉద్యమ వీరుడు.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు.. జన రంజక పాలకుడు.. పగలు ప్రతీకారాలు.. కక్షలు.. కార్పణ్యాలు అతని నిఘంటువులో లేవు. శరణు కోరితే శత్రువును కూడా ఆదుకునే గుణం.. అణువణువునా క్షమాగుణం.. 60 ఏళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెవర్చేందుకు నడుం భిగించాడు.. అడుగు ముందుకు వేశాడు. చివరకు సాధించాడు. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. బీఆర్‌ఎస్.. ఉరఫ్ టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం మొదలు పెట్టాడు. 13 ఏళ్లు కొట్టాడారు. అందరితో జైతెలంగాణ అనిపించాడు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకంగా నిలిచాడు. తెచ్చుకున్న తెలంగాణను తన పాలనా చాతుర్యం. నాయకత్వ ధీరోగుణంతో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన వ్యక్తి కేసీఆర్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న నేత కేసీఆర్. ఫిబ్రవరి 17న తెలంగాణ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ.
ఉద్యమం.. పాలనా వారసత్వం
14 సంవత్సరాల పోరాటంతో తెలంగాణను సాధించిన కేసీఆర్.. తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చారు. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపారు. విద్యుత్ కొరత లేకుండా, సాగునీటి సమస్య రాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. రైతు బంధు, మిషన్ భగీరథ, దళిత బంధు, కాళేశ్వరం వంటి కార్యక్రమాలతో దేశవ్యాప్త దిక్సూచులుగా నిలిచారు. ఈ చర్యలు ఆయనను ట్రెండ్ సెట్టర్‌గా చిరస్థాయిగా నిలబెట్టాయి. ప్రస్తుతం కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అభిమానులు ఆశిస్తున్నారు
రాజకీయ ఆకర్షణలు..
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉనాన.. కేసీఆర్ ప్రజల్లో కలిగి ఉన్న ఆదరణ ఏమీ తగ్గలేదని ఈ సంబరాలు చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలపడం రాజకీయ మర్యాదలకు ఉదాహరణగా మారింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసిఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు, ప్రవాసుల స్వాగతం ఈ ఆకట్టుకునే అంశాలు.