HomeతెలంగాణKavitha New Party: ఆ సారు మన సారు కాదు.. కేసీఆర్‌ మారిన మనిషి.. కవిత...

Kavitha New Party: ఆ సారు మన సారు కాదు.. కేసీఆర్‌ మారిన మనిషి.. కవిత ఎదురుదాడి!

Kavitha New Party: తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టింది. పాత పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. తండ్రి స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీ(తెలంగాణ రాష్ట్ర సమితి)ని తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ’కేసీఆర్‌ మన మనిషి కాదు, కనికరం లేని మరమనిషి’ అని, అవినీతి ఆరోపణలతో పండించారు.

కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలు
కవిత కేసీఆర్‌ను కనికరం లేని మరమనిషిగా చిత్రీకరించి, అవినీతి చేసిన ’పందికొక్కులను’ పక్కన పెట్టిన నాయకుడిగా వర్ణించారు. ఇది బీఆర్‌ఎస్‌కు అధ్యక్షుడిపై వ్యక్తిగత, రాజకీయ దాడి చేసి పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేశారు.

‘ఇన్‌ ఫ్రంట్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్‌’ హెచ్చరిక
కవిత ఇంతటితో ఆగకుండా ఇది కేవలం ఆరంభం, ముందు క్రొకడైల్‌ ఫెస్టివల్‌ ఉంది అని హెచ్చరించారు. ఇది బీఆర్‌ఎస్‌లో మరిన్ని అవినీతి బయటపడతాయనే సూచన. పార్టీలో దాగి ఉన్న పందికొక్కుల అవినీతిని బయటపెడతామని సంకేతం ఇచ్చారు.

కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ ఓటర్‌ బేస్‌లో సందేహాలను నాటుతాయి, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో. ’క్రొకడైల్‌ ఫెస్టివల్‌’ మెటాఫర్‌ భవిష్యత్‌ రివలేషన్లకు హైప్‌ సృష్టిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version