Kavitha: రాజకీయాలలో బంధాలకు, అనుబంధాలకు తావు ఉండదు. రాజకీయ నాయకులకు అధికారమే ముఖ్యం కాబట్టి.. దానికోసమే పాకులాడుతూ ఉంటారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. అవసరమైతే కుటుంబ సభ్యులను వదులుకోవడానికి వెనుకాడరు.. తరహా ఉదంతాలు మన దేశంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. కాకపోతే జరుగుతున్న సంఘటనలు మాత్రమే మారుతున్నాయి. అంతిమంగా పరమార్ధం మాత్రం ఒకటే.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన పది సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి తిరుగులేని స్థానంలో ఉండేది. ప్రతిపక్షాన్ని చీల్చడం ద్వారా కేసిఆర్ తిరుగులేని నాయకుడిగా తెలంగాణలో స్థిరపడిపోయారు. తన వారసుడిగా కేటీఆర్ ను తెలంగాణ సమాజానికి పరిచయం చేశారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహారాలు మొత్తం కేటీఆర్ చూసుకునేవారు. ఒకరకంగా అనధికారిక ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగే వారు. కేటీఆర్ స్థాయిలోనే ఉద్యమం చేసిన కవితకు చెప్పుకునే స్థాయిలో పదవులు దక్కలేదు. 2014లో పార్లమెంట్ సభ్యురాలిగా.. ఎన్నికయ్యారు. జాగృతి వ్యవస్థాపకరాలిగా కొనసాగే వారు. పార్టీలో కీలక వ్యవహారాలు సాగించే పదవి అనేది ఆమెకు ఉండేది కాదు. ఒక రకంగా పార్టీకి ఉన్న ఎంపీలలో ఆమె ఒక ఎంపీగా ఉండేవారు. చివరికి ఆమెకు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ పదవి కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కవితకు ఇబ్బందిని కలిగించాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. కవితకు కేసిఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత ప్రాధాన్యం పార్టీలో మరింత తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే తనకు ఇబ్బందికరమని భావించిన ఆమె పార్టీపై వ్యతిరేక స్వరం వినిపించారు. ఇదే క్రమంలో పార్టీ అధిష్టానం ఆమెను సస్పెండ్ చేసింది.. ఈ నేపథ్యంలోనే కవితను మరింత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు జరిగాయి.
ఈ ప్రయత్నాలను కవిత అత్యంత చాకచక్యంగా తిప్పి కొట్టారు. పార్టీ తనను సస్పెండ్ చేస్తే.. కవిత ఏకంగా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు.. పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. రాజీనామా కూడా స్పీకర్ ఫార్మాట్ లోనే కవిత సమర్పించారు. ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఫోన్ కూడా చేశారు. కవిత రాజీనామా చేసిన సమయం ప్రకారం చూసుకుంటే ఈపాటికి మండలి చైర్మన్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ ఆయన వేచి చూసే ధోరణి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆయన గులాబీ పార్టీలో ఉండేవారు.. సాధారణంగా స్పీకర్ ఫార్మాట్లో చేసిన రాజీనామాను వెంటనే ఆమోదిస్తారు. కానీ ఆయన పెండింగ్లో పెట్టారు. తద్వారా భారత రాష్ట్ర సమితికి షాక్ ఇచ్చే పరిణామాన్ని అమలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కవిత జాగృతి చీలిపోయింది. జాగృతిని కేటీఆర్ విజయవంతంగా చీల్చారని వినికిడి. ఎమ్మెల్సీ పదవి కూడా పోతే కవిత మరింత ఒంటరి అవుతుందని చర్చ కూడా జరిగింది. అయితే కవిత వ్యూహాత్మకంగా తన పదవి ఇప్పుడప్పుడే రద్దు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా తన సోదరుడికి షాక్ ఇచ్చారనే విశ్లేషణలు నడుస్తున్నాయి.